Thursday, August 7, 2025
E-PAPER
spot_img
Homeట్రెండింగ్ న్యూస్Jobs alert: నిరుద్యోగులకు శుభవార్త…3038 పోస్టులకు

Jobs alert: నిరుద్యోగులకు శుభవార్త…3038 పోస్టులకు

- Advertisement -

నవతెలంగాణ హైదరాబాద్: టీజీఎస్‌ఆర్టీసీలో ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ ఉద్యోగార్థుల్ని కొందరు మోసం చేస్తున్నట్టుగా యాజమాన్యం దృష్టికి వచ్చిందని ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్‌ అన్నారు. రాష్ట్ర ప్రభుత్వ అనుమతి మేరకు టీజీఎస్‌ఆర్టీసీలో 3038 పోస్టుల భర్తీకి సంబంధించిన కసరత్తు మొదలైందని ఆయన ప్రకటించారు. ఈ పోస్టులకు ప్రభుత్వ నియామక బోర్డుల ద్వారా నోటిఫికేషన్‌ త్వరలోనే వెలువడనుందన్నారు. ఈ నియామక ప్రక్రియ మెరిట్‌ ఆధారంగా పారదర్శకంగా జరుగుతుందని ఆయన ఓ ప్రకటనలో తెలిపారు. ఆర్టీసీలో ఉద్యోగాల పేరిట ఎవరైనా మిమ్మల్ని సంప్రదిస్తే వెంటనే యాజమాన్యం దృష్టికి తీసుకొచ్చి, స్థానిక పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేయాలని సంస్థ సూచిస్తోంది అని తెలపారు.

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img