Thursday, April 2, 2026
E-PAPER
Homeతాజా వార్తలుతెలంగాణ ప్రభుత్వం శుభవార్త

తెలంగాణ ప్రభుత్వం శుభవార్త

- Advertisement -

నవతెలంగాణ – హైదరాబాద్: తెలంగాణలో కొత్త పెన్షన్ల కోసం ఏండ్లుగా ఎదురుచూస్తున్న లక్షలాది మందికి తెలంగాణ ప్రభుత్వం తీపికబురు చెప్పింది. చేయూత పథకం కింద కొత్తగా మరో 2 లక్షల మందికి పెన్షన్లు మంజూరు చేయాలని నిర్ణయించింది. ఇందుకు అనుగుణంగా 2026-27 వార్షిక బడ్జెట్‌లో రూ.233 కోట్లను కేటాయించడంతో, లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియకు రంగం సిద్ధమైంది. అయితే, ఇప్పటికే పేరుకుపోయిన లక్షలాది దరఖాస్తుల నుంచి అర్హులను గుర్తించడం అధికారులకు పెను సవాల్‌గా మారనుంది.

ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా వివిధ కేటగిరీలలో 42.23 లక్షల మంది నెలనెలా చేయూత పెన్షన్లు పొందుతున్నారు. వృద్ధులు, వితంతువులు, ఒంటరి మహిళలు, గీత, చేనేత కార్మికులు, హెచ్‌ఐవీ, బోదకాలు బాధితులకు నెలకు రూ.2,016 చొప్పున ప్రభుత్వం అందిస్తోంది. దివ్యాంగులకు మాత్రం పెన్షన్‌ను రూ.4,016గా ఇస్తున్నారు. ఇప్పుడు ఈ జాబితాలోకి మరో 2 లక్షల మంది కొత్తగా చేరనున్నారు. గత మూడేళ్లుగా బోదకాలు, డయాలసిస్ బాధితులకు తప్ప కొత్తగా ఎలాంటి పెన్షన్లు మంజూరు కాకపోవడంతో అర్హులైన వారు తీవ్ర నిరాశలో ఉన్నారు. ఈ నేపథ్యంలో, రాష్ట్రవ్యాప్తంగా సుమారు 12 లక్షలకు పైగా దరఖాస్తులు ప్రభుత్వానికి చేరి పెండింగ్‌లో ఉన్నాయి. ఇటీవల బడ్జెట్‌లో కొత్త పెన్షన్ల ప్రకటన వెలువడిన తర్వాత, ఫిబ్రవరి 20 నుంచి ప్రజావాణి వంటి కార్యక్రమాల ద్వారా దరఖాస్తులు వెల్లువెత్తుతున్నాయి. దీనికి తోడు, గురువారం రాష్ట్రవ్యాప్తంగా జరుగుతున్న గ్రామసభల్లో కూడా భారీగా దరఖాస్తులు వచ్చే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -