Tuesday, May 20, 2025
Homeఖమ్మంసద్వినియోగంతోనే సత్ఫలితాలు…

సద్వినియోగంతోనే సత్ఫలితాలు…

- Advertisement -
  • – విజయవంతంగా ముగిసిన వేసవి శిక్షణా శిబిరం…
    – ముగింపు కు హాజరైన ఎంఈఓ ప్రసాదరావు…
    నవతెలంగాణ – అశ్వారావుపేట
  • శిక్షణ ఏదైనా సద్వినియోగం చేసుకున్న వారే సత్ఫలితాలు పొందుతారని ఎంఈఓ పొన్నగంటి ప్రసాదరావు అన్నారు. గత 15 రోజులుగా అశ్వారావుపేట జిల్లాపరిషత్ ఉన్నత పాఠశాలలో ప్రధానోపాధ్యాయురాలు పి.హరిత ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న వేసవి శిక్షణా శిబిరం సోమవారంతో ముగిసింది.  ఈ ముగింపు సమావేశానికి ముఖ్యఅతిధిగా విచ్చేసిన మండల విద్యాధికారి పి.ప్రసాదరావు మాట్లాడుతూ  15 రోజుల నుండి శిక్షణా శిబిరాన్ని చక్కగా నిర్వహించారని,ఇందులో విద్యార్ధులు అనేక అంశాలను తెలుసుకోవడంతో పాటు ఆటలు కూడా అడుకోవడం వారికి ఈ వేసవిలో ఆటవిడుపుగా ఉంటుందని అన్నారు.
  • కంప్యూటర్ పరిజ్ఞానంతో సహా షెడ్యూల్ ప్రకారం అన్ని అంశాలను నిర్వహించడం ప్రశంసనీయమని అన్నారు. విద్యార్ధులు ఈ శిబిరం ద్వారా ఏ మేరకు ఉపయోగం పొందారనేది వారితోనే చెప్పించారు.విద్యార్ధులు ఈ శిబిరంలో తయారు చేసిన వివిధ కళాకృతులను,చిత్రకళను పరిశీలించారు.అనంతరం ప్రతిభకనబర్చిన విద్యార్ధులకు బహుమతులు అందచేశారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు కిషోర్, నర్సింహారావు,పి.ఇ.టి రాజు,సి.ఆర్.పి ప్రభాకరాచార్యులు పాల్గొన్నారు.
- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -