Monday, February 23, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్పాలిటెక్నిక్ తో మంచి నైపుణ్యత..

పాలిటెక్నిక్ తో మంచి నైపుణ్యత..

- Advertisement -

నవతెలంగాణ – చిన్నకోడూరు 
పాలిటెక్నిక్ విద్యను అభ్యసిస్తే మంచి నైపుణ్యత ఉంటుందని ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల ప్రిన్సిపల్  స్నేహలత అన్నారు. సోమవారం చిన్నకోడూరు నారాయణరావుపేట మండలాల్లోని పదవ తరగతి విద్యార్థులకు పాలీసెట్ కోర్సులపై అవగాహన కల్పించారు. ఆమె ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పెద్దకోడూరు మహిళా పాలిటెక్నిక్ కళాశాలలో డి సి ఐ, డి ఐ డి, డీఈఈఈ, సివిల్,ఎలక్ట్రికల్, కంప్యూటర్ కోర్సులు ఉన్నాయన్నారు. హాస్టల్ వస్తే ఉందన్నారు. పాలీసెట్ ఎంట్రెన్స్ దరఖాస్తుకు ఏప్రిల్ 22 చివరి తేదని, మే 13న ప్రవేశ పరీక్ష ఉంటుందన్నారు. పాలిటెక్నిక్ కోర్సుల్లో చేరి అతి తక్కువ ఖర్చుతో నేరుగా ఇంజనీరింగ్ రెండో సంవత్సరంలో ప్రవేశానికి అవకాశం ఉంటుందన్నారు. కోర్సులు పూర్తి చేసిన వారికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ ప్రైవేటు కంపెనీ కార్పొరేట్ సంస్థల్లో ఉద్యోగ అవకాశాలు ఎక్కువగా ఉంటాయన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -