Saturday, August 16, 2025
E-PAPER
spot_img
Homeఆటలుక్రికెట్‌కు వేద గుడ్‌బై

క్రికెట్‌కు వేద గుడ్‌బై

- Advertisement -

అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు
చెన్నై :
భారత మహిళా క్రికెటర్‌, బ్యాటర్‌ వేద కృష్ణమూర్తి అంతర్జాతీయ క్రికెట్‌ నుంచి తప్పుకుంది. చివరగా 2020 ఐసీసీ టీ20 ప్రపంచకప్‌లో ఆడిన వేద కృష్ణమూర్తి ఐదేండ్లుగా జాతీయ జట్టుకు దూరమైంది. భారత్‌ తరఫున 48 వన్డేలు, 76 టీ20లు ఆడిన వేద కృష్ణమూర్తి.. 2017 ఐసీసీ వన్డే వరల్డ్‌కప్‌ సెమీఫైనల్లో కీలక ప్రదర్శనతో జట్టును ఫైనల్‌కు చేర్చింది. చివరగా డబ్ల్యూపీఎల్‌ 2024లో గుజరాత్‌ జెయింట్స్‌ తరఫున బరిలోకి దిగిన వేద కృష్ణమూర్తి..అంతర్జాతీ క్రికెట్‌ నుంచి తక్షణమే వైదొలుగుతున్నట్టు ప్రకటించింది. వేద కృష్ణమూర్తి టీ20ల్లో 63 ఇన్నింగ్స్‌ల్లో 875 పరుగులు చేసింది. అందులో రెండు అర్థ సెంచరీలు ఉన్నాయి. డబ్ల్యూపీఎల్‌లో నాలుగు మ్యాచులు ఆడిన వేద.. తొలి సీజన్‌ వేలంలో అమ్ముడుపోలేదు.

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img
Ad
Ad