అమెరికాకు తేల్చిచెప్పిన రష్యా
బెర్లిన్ : మధ్య శ్రేణి క్షిపణులను మోహరించకుండా నిషేధిస్తున్న ఒప్పందా నికి ఇక తాను కట్టుబడి ఉండనని రష్యా స్పష్టం చేసింది. ఈ విషయాన్ని రష్యా విదేశాంగ శాఖ సోమవారం ప్రకటించింది. కాగా క్షిపణి ఒప్పందాన్ని గత దశాబ్ద కాలంగా రష్యా ఉల్లంఘిస్తూనే ఉన్నదని అమెరికా ఆరోపిస్తోంది. ఒప్పందంలో నిషే ధించిన క్షిపణులను ఉక్రెయిన్‌తో యుద్ధ సమయంలో రష్యా ఉపయోగి స్తోందని చెబుతోంది. ‘ఇక ఈ ఒప్పందా నికి ఎంతో కాలం కట్టుబడి ఉండం. మధ్య శ్రేణి క్షిపణుల వినియోగానికి సంబంధించి గతంలో కుదుర్చుకున్న ఒప్పందాన్ని అమలు చేసే విషయంలో స్వీయ ఆంక్షలు విధించుకున్నాం. అయితే యూరప్‌లోనూ, ఆసియాలోనూ అమెరికా ఇలాంటి క్షిపణు లనే మోహరిస్తోంది’ అని రష్యా విదేశాంగ శాఖ ఆ ప్రకటనలో తెలిపింది. దీనిపై అమెరికా ఇంకా ఎలాంటి వ్యాఖ్య చేయలేదు. 1987లో కుదుర్చుకున్న ఒప్పందం ప్రకారం భూమి నుంచి ప్రయోగించి ఐదు వందల నుంచి ఐదు వేల ఐదు వందల కిలోమీటర్ల దూరంలోని లక్ష్యాలను ఛేదించే బాలిస్టిక్, క్రూయిజ్ క్షిపణుల వినియోగాన్ని నిషేధించారు. ఈ ఒప్పందం ఫలితంగా 2,600 సోవియట్, అమెరికా క్షిపణుల వినియోగాన్ని నిలిపివేశారు. అయితే 2019లో డోనాల్డ్ ట్రంప్ తొలిసారి అమెరికా అధ్యక్షుడు అయినప్పుడు ఈ ఒప్పందం నుంచి వాషింగ్టన్ వైదొలిగింది. రష్యా చాలా కాలం నుంచి ఒప్పందాన్ని ఉల్లంఘిస్తోందని, 9ఎం729 క్రూయిజ్ (ఎస్‌ఎస్‌సీ-8) క్షిపణులను ప్రయోగిస్తోందని అమెరికా ఆరోపించింది. అయితే అలాంటి ఉల్లంఘనలేవీ జరగలేదని రష్యా స్పష్టం చేసింది. కాగా అమెరికాకు చెందిన రెండు జలాంతర్గా ములను రష్యా తీరంలో ఉంచాలని ట్రంప్ ఆదేశించిన నేపథ్యంలో రష్యా ఈ ప్రకటన చేయడం గమనార్హం. ఈ ప్రకటనను రష్యా మాజీ అధ్యక్షుడు డెమిట్రీ మెద్వదేవ్ స్వాగతించారు. నాటో దేశాలు రష్యా వ్యతిరేక విధానాలను అవలంబిస్తున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇలాంటి మరిన్ని చర్యల కోసం వేచి చూడండంటూ హెచ్చరిక జారీ చేశారు.
ఇక క్షిపణి ఒప్పందానికి బైబై
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES