Monday, December 29, 2025
E-PAPER
Homeజాతీయంబీహార్‌లో పట్టాలు తప్పిన గూడ్స్‌

బీహార్‌లో పట్టాలు తప్పిన గూడ్స్‌

- Advertisement -

పలు రైల్వే సర్వీసులకు అంతరాయం

పాట్నా : బీహార్‌లో జమురు జిల్లాలో ఒక గూడ్స్‌ రైలు పట్టాలు తప్పింది. ఈ ప్రమాదంలో రైలుకు చెందిన ఎనిమిది వ్యాగన్లు పట్టాలు తప్పాయి. ఈ ఘటనలో ఎటువంటి ప్రాణనష్టం జరగలేదు. అయితే హౌరా-పాట్నా-ఢిల్లీ మార్గంలో అనేక రైల్వే సర్వీసులకు అంతరాయం ఏర్పడింది. ఈ విషయాన్ని తూర్పు మధ్య రైల్వే (ఇసిఆర్‌) ఒక ప్రకటనలో తెలిపింది. తూర్పు రైల్వేలోని అసన్సోల్‌ డివిజన్‌లోని లహాబన్‌-సిముల్తాలా స్టేషన్ల మధ్య శనివారం రాత్రి 11:25 గంటలకు గూడ్స్‌ రైలు ఎనిమిది వ్యాగన్లు పట్టాలు తప్పాయని ఇసిఆర్‌ చీఫ్‌ పబ్లిక్‌ రిలేషన్‌ ఆఫీసర్‌ సరస్వతి చంద్ర తెలిపారు.

గూడ్స్‌ పట్టాలు తప్పడం వలన ఈ సెక్షన్‌లోని ఆప్‌, డౌన్‌ లైన్లలో రైలు కార్యకలాపాలకు అంతరాయం కలిగిందని తెలిపారు. ప్రమాద వార్త తెలిసిన వెంటనే అసన్సోల్‌, మధుపూర్‌, జుఝూ స్టేషన్ల నుంచి సంఘటనాస్థలానికి సహాయ బృందాలను పపించామని, పునరుద్ధరణ పనులు యుద్ధ ప్రాతిపదికన జరుగుతున్నాయని వెల్లడించారు. తూర్పు మధ్య రైల్వేలోని దానాపూర్‌ డివిజన్‌ గూండా ప్రయాణించే అనేక రైళ్లు ప్రభా వితమయ్యాయి. ఆదివారం సాయంత్రం వరకూ 11 మంది రైళ్లను రద్దు చేయగా, సుమారు 20 రైళ్లను దారి మళ్లించారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -