Tuesday, August 26, 2025
E-PAPER
spot_img
Homeజాతీయంప‌ట్టాలు త‌ప్పిన గూడ్స్ రైలు..చెల‌రేగిన‌ మంట‌లు

ప‌ట్టాలు త‌ప్పిన గూడ్స్ రైలు..చెల‌రేగిన‌ మంట‌లు

- Advertisement -

న‌వ‌తెలంగాణ‌-హైద‌రాబాద్‌: త‌మిళ‌నాడులో రైల్వే ప్ర‌మాదం చోటుచేసుకుంది. చెన్నై తిరువళ్లూరు సమీపంలో ఇంధనంతో వెళ్తున్న గూడ్స్ రైలులో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. పోర్టు నుండి చమురుతో వెళ్తున్న సరుకు రవాణా రైలులో అకస్మాత్తుగా పట్టాలు తప్పడంతో మంటలు చెలరేగాయని సమాచారం. ఎగసిపడుతున్న మంటల కారణంగా ఆ ప్రాంతమంతా దట్టమైన పొగతో కప్పబడి ఉంది. రైలులో ఇంధనం ఉన్నందున మంటలు మరింత వ్యాపిస్తాయని ఆందోళన చెందుతున్నారు అధికారులు.

అగ్నిప్రమాదం గురించి సమాచారం అందుకున్న అగ్నిమాపక దళం, వెంటనే భారీ ఎత్తున చేరుకొని మంటలను ఆర్పడానికి చాలా కష్టపడుతోంది. మంటలను ఆర్పడానికి 10కి పైగా అగ్నిమాపక యంత్రాలతో మోహరించారు.

మంటల కారణంగా అరక్కోణం మీదుగా వచ్చిన సెంట్రల్ ఎక్స్‌ప్రెస్ రైళ్లను వివిధ ప్రదేశాలలో నిలిపివేశారు. అలాగే, ఉదయం 5.50 గంటలకు బయలుదేరాల్సిన మైసూర్ వందే భారత్ రైలును చెన్నై సెంట్రల్ రైల్వే స్టేషన్‌లో నిలిపివేశారు. ఉదయం 6 గంటలకు బయలుదేరాల్సిన మైసూర్ శతాబ్ది రైలును కూడా నిలిపివేశారు.

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img
Ad
Ad