Monday, November 10, 2025
E-PAPER
Homeట్రెండింగ్ న్యూస్మిస్టరీగా గోపీనాథ్‌ మరణం

మిస్టరీగా గోపీనాథ్‌ మరణం

- Advertisement -

హైదరాబాద్‌ ప్రెస్‌క్లబ్‌లో మీడియాతో ఎమ్మెల్యే మాగంటి తల్లి మహానంద కుమారి

నవతెలంగాణ- సిటీబ్యూరో
దివంగత ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్‌ మృతిపై ఆయన తల్లి మహానంద కుమారి సంచలన వాఖ్యలు చేశారు. గోపీనాథ్‌ మరణం మిస్టరీగా అనిపిస్తోందన్నారు. ఆయన ఎప్పుడు చనిపోయారన్నది తల్లిగా తనకే తెలియదన్నారు. జూన్‌ 6న చనిపోయారా.. లేక 8న చనిపోయారా అనేేది సందేహంగా ఉందన్నారు. ఆదివారం హైదరాబాద్‌ ప్రెస్‌క్లబ్‌లో మాగంటి మొదటి భార్య మాలినీ, ఆమె కుమారుడు తారక్‌తో కలిసి మహానంద కుమారి మీడియాతో మాట్లాడారు. గోపీనాథ్‌ మరణిం చినప్పుడు కేటీఆర్‌ పరామర్శకు వచ్చిన తర్వాతే మరణ వార్తను బయటకు చెప్పారని అన్నారు. గోపీనాథ్‌ మూడుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికై గొప్ప పేరు తెచ్చుకున్నారని చెప్పారు.

అలాంటి వ్యక్తి ఆస్పత్రిలో ఉంటే ఒక్కరోజు కూడా చూడటానికి సమయం ఇవ్వలేదన్నారు. ఒక అటెండర్‌నూ పెట్టలేదని వాపో యారు. ఆయన జూన్‌ 8న చనిపోయారని చెప్పారని తెలిపారు. లీగల్‌ హెయిర్‌ సర్టిఫికెట్‌లో మొదటి భార్యాబిడ్డల పేర్లు, తన పేరు కూడా లేదన్నారు. దీనిపై ఆగస్టు 11వ తేదీ నుంచి తహసీల్దారు కార్యాలయం చుట్టూ తిరుగుతున్నామని చెప్పారు. ఈ సమస్య ఇప్పటికీ పరిష్కారం కాలేదన్నారు. ఫ్యామిలీ సర్టిఫికెట్‌లోనూ తమ పేర్లు లేవని చెప్పారు. మొదటి భార్యతో విడాకులు కాలేదని స్పష్టంచేశారు. మాలినీని వద్దనుకుంటే ఆమెతో విడాకులు ఎప్పుడో తీసుకునేవారని, అలా జరగలేదంటే వారిపై సాఫ్టు కార్నర్‌ ఉన్నట్టేనని అన్నారు.

తాను గోపీనాథ్‌, సునీతలకు పెండ్లి చేయలేదన్నారు. గోపీనాథ్‌ మరణించినప్పుడు కేటీఆర్‌ వెంట పరిగెత్తి తనకు జరిగిన అన్యాయం గురించి చెప్పాలనుకుంటే ఆయన కూడా వినలేదని తెలిపారు. ఇది డబ్బు సమస్య కాదనీ, తమకు గుర్తింపు లేదనీ, అందుకే మీడియా ముందుకు వచ్చినట్టు తెలిపారు. తాను తల్లిగా ఎంతో బాధపడు తున్నానని వాపోయారు. సునీతకు టికెట్‌ ఇచ్చేటప్పుడు కేటీఆర్‌ తమకు కనీస సమాచారం ఇవ్వలేదన్నారు. గోపీనాథ్‌ మొదటి భార్య కుమారునికి గుర్తింపు ఉండాలని ఆయన భార్య మాలినీ ఎంతో బాధపడుతోందన్నారు. ఎన్నో అవమానాలు ఎదుర్కొంటుందన్నారు. నలుగురిలో నిరూపించుకోవాలని తాము బయటకు వచ్చామని తెలిపారు. తన పెద్ద కుమారుడు కూడా టికెట్‌ కోసం ప్రయత్నించాడని తెలిపారు. గోపీనాథ్‌ తల్లిగా తనకు అడగాల్సిన హక్కులేదా అని ప్రశ్నించారు.

మాకు గుర్తింపు లేదు : తారక్‌
తమకు లీగల్‌గా ఎలాంటి గుర్తింపు లేదని గోపీనాథ్‌ మొదటి భార్య కుమారుడు తారక్‌ ఆవేదన వ్యక్తం చేశారు. తన తల్లితో చట్టపరంగా విడాకులు కాలేదన్నారు. నేనంటే ఎవరో తెలియదని సునీత అన్నారని వాపోయారు. జూన్‌ 6న తనకు ఫోన్‌ చేశారని, తానేవరో తెలియకపోతే తనకేందుకు ఫోన్‌ చేశారని ప్రశ్నించారు. తన గ్రాడ్యుయేషన్‌ డేకు రావాలని తన తండ్రి గోపీనాథ్‌ అనుకున్నారని, కానీ ఆయన హఠాత్తుగా చనిపోయారని తెలిపారు. సునీత ఫోన్‌ చేసి నేను ఇండియాకు రావాల్సిన అవసరంలేదని, రెజ్యూమ్‌ పంపిస్తే కేటీఆర్‌ అంకుల్‌ కంపెనీలో ఉద్యోగం ఇప్పిస్తానని చెప్పిందన్నారు. మా పెద్ద నాన్నపై అనవసరపు ఆరోపణలు చేస్తున్నారని అన్నారు. జూన్‌ 25న ఫ్యామిలీ మెంబర్‌ సర్టిఫికెట్‌ కోసం అప్లరు చేశారని, అప్పుడు అఫిడవిట్‌లో ఎవరెవరి పేర్లు పెట్టారో తనకు తెలియదని అన్నారు. తన తల్లి, నాన్నమ్మ తన పేర్లను లీగల్‌ హెయిర్‌ సర్టిఫికెట్‌లో పెట్టాలని కోరారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -