– జుక్కల్ నియోజకవర్గ బి ఆర్ ఎస్ పార్టీ యూత్ ఇంచార్జీ శివ గౌడ్
నవతెలంగాణ – జుక్కల్: మధ్యం టెండర్లను ప్రభుత్వం గౌడ్లకి ఇస్తామ్మన్నా 25 శాతం షాపులు ఇవ్వాలని జుక్కల్ నియోజకవర్గ యూత్ ఇంచార్జ్ శివ కుమార్ గౌడ్ గురువారం నాడు ఒక ప్రకటనలో డిమాండ్ చేసారు. ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో వస్తే ఇప్పుడున్న 15శాతం మధ్యం షాపుల నుండి 25 శాతం వరకు ఇస్తామని హామీ ఇచ్చి ఇప్పుడు గద్దెకేక్కిన తరువాత మళ్లి పాత పద్దతిని కొంసాగించడం అంటే గౌడలకు మోసాగించడమే అని అన్నారు. నవంబర్ నెలలో ముగియనున్న మధ్యం షాపుల టెండర్ల మళ్లి వేలంపాట కోసం ప్రభుత్వం, ఎక్సైజ్ అధికారులు సంసిద్ధమవుతున్నారని తెలిపారు.
ఈ సమయంలో గ్రామాల్లో ఇప్పటికి విచ్చలవిడిగా బెల్ట్ షాపుల నిర్వహణతో వున్నా ఒక్క ఉపాధి లేక గౌడ్లు ఆర్థిక స్థిరత్వం కోల్పోతున్నారని వారు వాపోయారు. కాబట్టి ప్రభుత్వంనుండి 25 శాతం టెండర్లను వారికి పొందగల్గిన వారీ కోటా ద్వారా ఇవ్వాలని కోరారు. మధ్యం టెండర్ ప్రక్రియలో గౌడ కుటుంబాలకు మధ్యం టెండర్లను ఇవ్వాలని జిల్లా అధికారులను కోరారు.