- Advertisement -
నవతెలంగాణ – మల్హర్ రావు(కాటారం) : కాటారం మండల కేంద్రంలో సోమవారం వికలాంగుల హక్కుల పోరాట సమితి జిల్లా అధ్యక్షుడు మాచర్ల వంశీకృష్ణ గౌడ్ ఆధ్వర్యంలో వికలాంగుల సమావేశం నిర్వహించి,పలు అంశాలపై చర్చించారు. అనంతరం కాటారం మండల విగాలాంగుల హక్కుల పోరాట సమితి కమిటీ నియమించారు.అధ్యక్షుడుగా గోవు రవిందర్, ఉపాధ్యక్షుడుగా దడిగల సత్యం లకు ఏకగ్రీవంగా నియమించారు.ఈ కార్యక్రమంలో వికలాంగుల హక్కుల పోరాట సమితి జిల్లా ఉపాధ్యక్షుడు దుర్గం శంకరయ్య,ఎమ్మార్పీఎస్ మండల ఇంచార్జి కేశారపు నరేశ్ మాదిగ,మండల అధ్యక్షుడు మంతేన చిరంజీవి మాదిగ,వికలాంగులు,వృద్ధులు,వితంతువులు,ఒంటరి మహిళలు,గీత,బీడీ కార్మికులు పాల్గొన్నారు.
- Advertisement -