Friday, March 6, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్ప్రభుత్వ సలహాదారు వేం నరేందర్ రెడ్డికి ఘన సన్మానం

ప్రభుత్వ సలహాదారు వేం నరేందర్ రెడ్డికి ఘన సన్మానం

- Advertisement -

నవతెలంగాణ – కంఠేశ్వర్
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ సలహాదారుడిగా ఇదివరకే కొనసాగించి ప్రస్తుతం రాజ్యసభ సభ్యుడుగా ఎంపికైన వేం నరేందర్ రెడ్డి కి నిజామాబాద్ జిల్లా కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు కాటేపల్లి నరేందర్ రెడ్డి మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్చాన్ని అందించి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు కాటిపల్లి నరేందర్ రెడ్డి మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీలో కార్యకర్తగా కొనసాగుతూ వారికి మేలు జరిగే విధంగా కృషిచేసిన ప్రతి ఒక్కరికి కాంగ్రెస్ పార్టీలో ప్రత్యేక స్థానం ఉంటుందని, తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎన్నికల ప్రచారంలో బహిరంగ సభలోని ప్రజల సమక్షంలో ఇచ్చిన హామీలను నెరవేర్చడంతో చిరస్థాయిలో ప్రజల గుండెల్లో నిలిచిపోతారని ఆయన అన్నారు.

కాంగ్రెస్ పార్టీకి కష్టపడి పనిచేసిన ప్రతి ఒక్క కార్యకర్త రాష్ట్ర ప్రభుత్వం నుంచి వచ్చే సంక్షేమ ఫలాలను ప్రజల వద్దకు చేరే విధంగా కృషి చేయాలని ఆయన సూచించడం జరిగిందనీ అన్నారు. రాబోయే రోజులలో విడుతల వారీగా సీనియర్ నాయకులు కాంగ్రెస్ పార్టీకి కృషిచేసిన పనితీరును దృష్టిలో పెట్టుకొని ఖచ్చితంగా పదవులు కట్టబెట్టడం జరిగి తీరుతుందని రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రతి సీనియర్ నాయకుడికి భరోసా ఇవ్వడం జరిగిందన్నారు. రాజ్యసభ సభ్యుడుగా  ఎంపికైనందున వేం నరేందర్ రెడ్డి కి శాలువా కప్పి పుష్పగుచ్చాన్ని అందించి మర్యాదపూర్వకంగా కలిసిన వారిలో కాటిపల్లి నరేందర్ రెడ్డి తోపాటు కాటిపల్లి రాహుల్ కుమార్ రెడ్డి ఉన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -