Friday, September 12, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్వినాయక శోభాయాత్ర రూట్ మ్యాప్ ను పరిశీలించిన ప్రభుత్వ సలహాదారులు 

వినాయక శోభాయాత్ర రూట్ మ్యాప్ ను పరిశీలించిన ప్రభుత్వ సలహాదారులు 

- Advertisement -

నవతెలంగాణ – కంఠేశ్వర్ 
నిజామాబాద్ జిల్లా కేంద్రంలో వినాయక శోభాయాత్ర రూట్ మ్యాప్ ను తెలంగాణ ప్రభుత్వ సలహాదారులు మహమ్మద్ అలీ షబ్బీర్ గురువారం పరిశీలించారు. ఈ సందర్భంగా విద్యుత్ అధికారులు మున్సిపల్ అధికారులు పోలీస్ అధికారులతో సమావేశం నిర్వహించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ .. 

పట్టణంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు కట్టుదిట్టమైన ఏర్పాటు చేయాలని ఆదేశించారు. అలాగే విద్యుత్ అధికారులను అప్రమత్తంగా ఉండాలని వినాయక ఉత్సవ ఊరేగింపులో అప్రమత్తంగా ఉండి విద్యుత్ తీగలను ఉత్సవ విగ్రహాలకు అంతరాయం కలగకుండా చూడాలన్నారు. కేబుల్ వైర్లను తొలగించి రోడ్డు రోడ్డుపై ఉన్న గుంతలను పూడ్చి గణేష్ శోభ యాత్రలో ఎలాంటి ఆటంకాలు ఇబ్బందులు లేకుండా చూడాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో నుడా చైర్మన్ కేశ వేణు,రైతు కమిషన్ సభ్యులు గడుగు గంగాధర్, కాంగ్రెస్ పార్టీ నాయకులు నరాల రత్నాకర్,  తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -