- Advertisement -
నవతెలంగాణ – భిక్కనూర్
మండలంలోని బస్వాపూర్ గ్రామంలో ఎస్సీ కాలనీలో గత కొంతకాలంగా విద్యుత్ సమస్యతో బాధపడుతున్న ఇబ్బందులను సర్పంచ్ తుడుం పద్మ స్వామి ప్రభుత్వ సలహాదారులు మహమ్మద్ షబ్బీర్ అలీ దృష్టికి తీసుకెళ్ళారు. వెంటనే స్పందించిన షబ్బీర్ అలీ విద్యుత్ అధికారులతో మాట్లాడి కొత్త ట్రాన్స్ ఫార్మర్, విద్యుత్ లైన్ వేయించి సమస్య పరిష్కరించారు. సమస్య పరిష్కరించినందుకు కాలనీవాసులు ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ గ్రామ అధ్యక్షుడు సిద్ధ రాములు, ఎస్సీ సెల్ మండల అధ్యక్షులు జీవన్, సీనియర్ నాయకులు బాగారెడ్డి, పంచాయతీ కార్యదర్శి దయాకర్ రెడ్డి, వాటి సభ్యులు, తదితరులు ఉన్నారు.
- Advertisement -



