Saturday, February 21, 2026
E-PAPER
Homeబీజినెస్ప్రభుత్వ బ్యాంక్‌ షేర్ల ప్రభంజనం

ప్రభుత్వ బ్యాంక్‌ షేర్ల ప్రభంజనం

- Advertisement -

– ఇన్వెస్టర్లకు రూ.6 లక్షల కోట్ల కాసుల వర్షం
– ప్రయివేటు కోటలకు బీటలు..!
ముంబయి :
ప్రయివేటు దిగ్గజ విత్త సంస్థలకు దీటుగా ప్రభుత్వ రంగ బ్యాంకులు ప్రభంజనం సృష్టి స్తున్నాయి. ఇటీవల భారత స్టాక్‌మార్కెట్‌లో ప్రభుత్వ రంగ బ్యాంక్‌ల షేర్లు ఇన్వెస్టర్లకు కాసుల వర్షం కురిపి స్తున్నాయి. గత ఆరు నెలల కాలంలో ఇవి కేవలం లాభాలను మాత్రమే కాదు.. ఇన్వెస్టర్ల నమ్మకాన్ని కూడా భారీగా పెంచుకున్నాయి. ఈ స్వల్ప కాలం లోనే దేశంలోని 12 ప్రధాన ప్రభుత్వ రంగ బ్యాంకుల మార్కెట్‌ విలువ ఏకంగా రూ. 5.75 లక్షల కోట్లు పెరిగి మొత్తం రూ.21.35 లక్షల కోట్లకు చేరు కుంది. ప్రయివేటు రంగ బ్యాంకులు సైతం అందు కోలేని వేగంతో ఈ బ్యాంకుల విలువలు పెరగడం మార్కెట్‌ విశ్లేషకులను ఆశ్చర్యానికి గురి చేస్తోన్నాయి.

ప్రయివేటు బ్యాంక్‌లకు గండి..
ప్రయివేటు బ్యాంకుల ఆధిపత్యానికి గండికొడు తూ ప్రభుత్వ బ్యాంకులు ఇంతటి భారీ వృద్ధిని ఎలా సాధించాయనేది మార్కెట్‌ వర్గాల్లో ఇప్పుడు పెద్ద చర్చనీయాంశంగా మారింది. దీని వెనుక ప్రధానం గా మూడు బలమైన కారణాలు ఉన్నాయని విశ్లేషిస్తున్నారు. గత దశాబ్ద కాలంలో ఎన్నడూ లేనం తగా పిఎస్‌బిల మొండి బాకీలు కనిష్ట స్థాయికి చేరు కున్నాయి. గతంలో గుదిబండగా మారిన బకాయిలు ఇప్పుడు వసూలు కావడంతో బ్యాంకుల లాభదాయ కత రికార్డు స్థాయికి చేరింది. మరోవైపు రిటైల్‌, వ్యవసాయం, ఎంఎస్‌ఎంఇ రంగాలకు రుణాలు అందించడంలో ప్రయివేటు బ్యాంక్‌లను పిఎస్‌యు బ్యాంకులు మించిపోయాయి. గడచిన డిసెంబర్‌ త్రైమాసికంలో ప్రభుత్వ బ్యాంకులు 14.5 శాతం రుణ వృద్ధిని సాధించగా, ప్రయివేటు బ్యాంకులు 12 శాతం పెరుగుదల లోపే పరిమితమయ్యాయి. ఇప్పటికీ ప్రయివేటు బ్యాంకుల తో పోలిస్తే ప్రభుత్వ బ్యాంకుల షేర్లు తక్కువ ధరలో అందుబాటులో ఉండటం ఇన్వెస్టర్లను ఆకర్షిస్తోన్నాయి.

బిఒఐ, ఎస్‌బిఐ భళా..
ఈ ర్యాలీలో బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా ఏకంగా 50 శాతం వృద్ధిని కనబరచగా.. ఎస్‌బిఐ 47శాతం పెరు గుదలతో అగ్రస్థానంలో నిలిచింది.మరోవైపు యూని యన్‌ బ్యాంక్‌, కెనరా బ్యాంక్‌, ఇండియన్‌ బ్యాంకులు కూడా ఇన్వెస్టర్ల సంపదను రెట్టింపు చేసే దిశగా అడుగులు వేస్తున్నాయి. ప్రయివేటు బ్యాంకులు ఎకు డిపాజిట్ల సేకరణలో ఇబ్బందులు పడుతుంటే, ప్రభు త్వ బ్యాంకులు తమకున్న భారీ నెట్‌ వర్క్‌, ప్రజల నమ్మకంతో తక్కువ ఖర్చుతో కూడిన డిపాజిట్లను కలిగి ఉండటం వీటికి అతిపెద్ద సానుకూలాంశంగా మారిందని నిపుణులు పేర్కొంటున్నారు.

ర్యాలీ ఇంకా ముగియలేదు..!
ప్రస్తుతం నిఫ్టీ పిఎస్‌యు బ్యాంక్‌ ఇండెక్స్‌ 34 శాతం లాభాల్లో ఉంది. ప్రయివేటు బ్యాంకుల నిష్పత్తితో పోలిస్తే ప్రభుత్వ బ్యాంకులు ఇంకా చౌకగానే ఉన్నాయి. దీంతో రాబోయే రోజుల్లో ఈ బ్యాంకుల షేర్లు మరిన్ని గరిష్టాలను తాకే అవకాశం స్పష్టంగా కనిపిస్తోందని నిపుణులు అంచనా వేస్తోన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -