చట్టపరమైన అవాంతరాలను అధిగమిస్తాం :నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
సిద్దిపేట జిల్లా అక్కన్నపేట మండలంలోని గౌరరెల్లి ప్రాజెక్ట్ పూర్తికి రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్‌రెడ్డి స్పష్టం చేశారు. ప్రాజెక్ట్ పురోగతిపై సోమవారం హైదరాబాద్‌లోని డాక్టర్ బీఆర్. అంబేద్కర్ సచివాలయంలో మంత్రి పొన్నం ప్రభాకర్‌తో కలసి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ లక్షా 6 వేల ఎకరాల ఆయకట్టుకు సాగునీరు అందించే లక్ష్యంతో మొదలు పెట్టిన ఈ ప్రాజెక్ట్ పర్యావరణ అనుమతుల తో పాటు న్యాయపరమైన చిక్కులు ఏర్పడడంతో పనులు మందగించాయన్నారు. పర్యావరణ, న్యాయ పరమైన అవంతారాలను అధిగమించి త్వరితగతిన పూర్తి చేసేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టిందని చెప్పారు. అదనపు ఆయకట్టును సాగులోకి తేవాలనే లక్ష్యంతో ప్రాజెక్ట్ సామర్థ్యాన్ని 1.41 టీఎంసీల నుంచి 8.23 టీఎంసీలకు పెంచామని అన్నారు. భూసేకరణకు అవసరమైన నిధులను జూన్ 2కు ముందే విడుదల చేస్తామనీ, అందుకు సంబంధిం చిన ప్రక్రియను సకాలంలో పూర్తి చేయాలని కరీంనగర్, జనగామ, సిద్దిపేట జిల్లాల కలెక్టర్లను ఆదేశించారు. న్యాయపరమైన అంశాలను ఎదుర్కొం టున్న గౌరవెల్లి ప్రాజెక్ట్‌కు సంబంధించిన కేసు మరో రెందు రోజుల్లో విచారణకు రానున్న నేపథ్యÛం లో… చిక్కులను అధిగమించేెందుకు అవసరమైన వ్యూహం తో సిద్ధంగా ఉండాలని సమీక్షలో పాల్గొన్న అడ్వకేట్ జనరల్‌ను ఆదేశిం చారు. మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ పట్టణీకరణ వేగంగా పెరుగుతున్న సదర్భంలో భూముల ధరలు పెరగడంతో రైతులు పెద్ద మొత్తంలో నష్టపరిహారం కోరుకుంటున్నారనీ, అందుకు సంబంధించిన విధాన పరమైన నిర్ణయాలు త్వరితగతిన తీసుకోవాలని సూచించారు. కార్య క్రమంలో రాష్ట్ర నీటిపారుదల శాఖా సలహాదారు ఆదిత్యదాస్, ప్రత్యేక కార్యదర్శి ప్రశాంత్ జీవన్ పాటిల్, ఆర్‌అండ్‌ఆర్ కమిషనర్ శివకుమార్ నాయుడు, ఈఎన్‌సీ రమేష్‌బాబు పాల్గొన్నారు.
గౌరవెల్లి ప్రాజెక్ట్ పూర్తికి ప్రభుత్వం కట్టుబడి ఉంది
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



