– అక్టోబర్ నుంచే పత్తి సేకరణ మొదలు
– అవసరమున్న చోట కొత్త కొనుగోలు కేంద్రాలు
– కపాస్ కిసాన్ యాప్ ద్వారా రిజిస్ట్రేషన్
– ట్రాన్స్‌పోర్టుల్లో ఇబ్బంది రాకుండా రవాణా శాఖ చర్యలు
– కమాండ్ కంట్రోల్ ద్వారా పత్తి కొనుగోళ్ల పరిశీలన
– టోల్ ఫ్రీ నెంబర్ ఏర్పాటు… పర్యవేక్షణకు అధికారి నియామకం: అధికారులకు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఆదేశం
నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్
పత్తి రైతులకు కనీస మద్దతు ధర అందేలా కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (సీసీఐ)తో సమన్వయం చేసుకోవాలని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఆదేశించారు. రాష్ట్ర ప్రభుత్వం రైతులకు అన్ని విధాల సహాయ, సహకారాలుంటాయని భరోసా ఇచ్చారు. దేశంలోనే తెలంగాణ పత్తి నాణ్యతకు మారుపేరని వివరిం చారు. ప్రస్తుతం ఎమ్‌ఎస్‌పీ కంటే క్వింటాల్‌కు రూ. 1099 తక్కువగా ఉందని తెలిపారు. ఈ అంశం రైతులను ఆందోళనకు గురి చేస్తున్నదని పేర్కొన్నా రు. శుక్రవారం హైదరాబాద్‌లోని డాక్టర్ బీఆర్ అం బేద్కర్ రాష్ట్ర సచివాలయంలో సీసీఐ ప్రతినిధులు, వ్యవసాయ, మార్కెటింగ్ శాఖ అధికారులతో మంత్రి సమీక్షించారు. పత్తి ఉత్పత్తి, మార్కెట్ ధరల పరిస్థితి, రైతులకు చెల్లింపులు, జిన్నింగ్, ప్రాసెసింగ్ మిల్లుల ఏర్పాట్లు, రవాణా సమస్యలు, డిజిటలైజేషన్, రైతుల రిజిస్ట్రేషన్, స్థానిక కమిటీలు, ఫిర్యాదు పరిష్కారం వంటి అనేక అంశాలపై చర్చించారు. ఈ సందర్భం గా మంత్రి మాట్లాడుతూ అక్టోబర్ మాసం నుంచే పత్తి సేకరణకు ఏర్పాట్లు చేసుకోవాలని సూచించా రు. రైతులు ఎలాంటి ఇబ్బందులు పడకుండా ఉండేందుకు కొనుగోలు కేంద్రాలను 110 నుంచి 122కు పెంచినట్టు తెలిపారు. రాజన్న సిరిసిల్ల జిల్లాలో కొత్తగా కొనరావుపేటలో సీసీఐ కేంద్రాన్ని కూడా చేర్చాలని సూచించారు. జిన్నింగ్, ప్రాసెసింగ్ మిల్లులు, గోదాములు పత్తి రైతులకు అందుబాటులో ఉండేలా తగిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. రైతులకు ఎమ్‌ఎస్‌పీ చెల్లింపులు పూర్తిగా ఆధార్ ఆధారిత ధృవీకరణ తర్వాతే నేరుగా వారి బ్యాంకు ఖాతాల్లో జమ అయ్యే విధంగా చర్యలు చేపట్టాలని కోరారు. ‘కపాస్ కిసాన్’ యాప్ ద్వారా రైతులు స్వయంగా స్లాట్ బుక్ చేసుకోవచ్చన్నారు. దీనిపై రైతులకు ప్రత్యేక శిక్షణ ఇవ్వాలని సూచించారు. కౌలు రైతులు కూడా ఓటీపీ ఆధారంగా నమోదు చేసుకునే వీలుంటుందన్నారు. అయితే వారి వివరాలు సంబం ధిత పట్టాదారు ధృవీకరించిన తర్వాతే ఆమోదం పొందుతాయని తెలిపారు. ఈ విధానం వల్ల అర్హత కలిగిన ప్రతి రైతు ఎమ్‌ఎస్‌పీ ప్రయోజనం పొందే అవకాశం ఉంటుందని స్పష్టం చేశారు. పత్తి కొను గోళ్లు సక్రమంగా జరిగేందుకు స్థానికంగా మానిట రింగ్ కమిటీలను ఏర్పాటు చేయాలని ఆదేశించారు. ఇవి తేమ శాతం, నాణ్యత, తూకం, ధరల విషయం లో రైతులకు ఎలాంటి అన్యాయం జరగకుండా పర్యవేక్షిస్తాయని తెలిపారు. రైతుల ఫిర్యాదుల పరిష్కారం కోసం టోల్ ఫ్రీ నంబర్ 1800 599 5779, వాట్సాప్ హెల్ప్‌లైన్ 88972 81111 కొన సాగుతాయని తెలిపారు. ప్రతి కొనుగోలు కేంద్రం, జిన్నింగ్, ప్రాసెసింగ్ మిల్లుల్లో సీసీ కెమెరాలను తప్పనిసరిగా ఏర్పాటు చేయాలని కోరారు. రోజువారీ క్రయ, విక్రయాలను పరిశీలించేందుకు వ్యవసాయ కమిషనర్ కార్యాలయంలో కమాండ్ కంట్రోల్ రూమ్ సెంటర్ ఏర్పాటు చేయాలని ఆదేశించారు. గోదాము ల నుంచి మిల్లులకు పత్తి రవాణాలో ఆటంకాలు రాకుండా రవాణా శాఖ, జిల్లాల కలెక్టర్లు చర్యలు తీసుకోవాలని మంత్రి ఆదేశించారు.
మద్దతు ధర కోసం సీసీఐతో సర్కారు సమన్వయం
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES