Sunday, August 17, 2025
E-PAPER
spot_img
Homeజిల్లాలుప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలి 

ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలి 

- Advertisement -

మండల ఎన్నికల ఇంచార్జి రంగు కుమార్
నవతెలంగాణ – పెద్దవంగర
: కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలను ఎప్పటికప్పుడు ఎండగడుతూ ప్రజల్లోకి తీసుకెళ్లాలని స్థానిక సంస్థల ఎన్నికల మండల ఇంచార్జి రంగు కుమార్, బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు ఈదురు ఐలయ్య, పాలకుర్తి దేవస్థానం మాజీ చైర్మన్ వెనుకదాసుల రామచంద్రయ్య శర్మ అన్నారు. పెద్దవంగర గ్రామ ముఖ్య కార్యకర్తల సమావేశాన్ని గ్రామ పార్టీ అధ్యక్షురాలు నిమ్మల విజయ శ్రీనివాస్ అధ్యక్షతన బుధవారం నిర్వహించారు. ఈ సందర్భంగా కార్యకర్తలను ఉద్దేశించి వారు మాట్లాడారు.

ఎన్నికల వాగ్దానాలను అమలు చేయడంలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఫెయిల్ అయిందన్నారు. గత ప్రభుత్వ హయాంలో ఎర్రబెల్లి దయాకర్ రావు చేసిన అభివృద్ధిని ప్రజలకు వివరించాలని సూచించారు. బీఆర్ఎస్ గతంలో ప్రతి ఆరు నెలలకోసారి క్రమం తప్పకుండా రైతు బంధు పెట్టుబడి సాయం అందించి రైతాంగాన్ని ఆదుకుందని గుర్తు చేశారు. కానీ ఇప్పుడు ప్రభుత్వం ఎప్పుడు రైతు భరోసా వేస్తుందో అర్థంకాని పరిస్థితి నెలకొందని విమర్శించారు. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో బీఆర్ఎస్ జెండా జెండా ఎగరడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు.

పార్టీ గెలుపు కోసం కార్యకర్తలు సమన్వయంతో పనిచేయాలి దిశానిర్దేశం చేశారు. కార్యక్రమంలో మండల ప్రధాన కార్యదర్శి శ్రీరామ్ సంజయ్ కుమార్, సీనియర్ నాయకులు శ్రీరామ్ సుధీర్, ఫాక్స్ డైరెక్టర్ అనపురం రవి,  మాజీ ఉపసర్పంచ్ శ్రీరాం రాము, మండల ఎస్సీ సెల్ అధ్యక్షుడు చిలుక బిక్షపతి, మండల యూత్ ప్రధాన కార్యదర్శి కూతురు అనుదీప్, యూత్ అధ్యక్షుడు అనపురం రాజు, మండల ప్రచార కార్యదర్శి గద్దల వెంకన్న తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img
Ad
Ad