Saturday, September 27, 2025
E-PAPER
Homeజిల్లాలుసాంకేతిక విద్యకు ప్రభుత్వం ప్రాధాన్యత..

సాంకేతిక విద్యకు ప్రభుత్వం ప్రాధాన్యత..

- Advertisement -

ఏటీసీని ప్రారంభించిన ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య 
నవతెలంగాణ – ఆలేరు

ఆలేరు పట్టణంలోని పారిశ్రామిక శిక్షణ సంస్థ( ఐటిఐ) లో నిర్మించిన అడ్వాన్సుడ్ టెక్నాలజీ సెంటర్ (ఏటిసి) ని  శనివారం ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య ప్రారంభించారు. హైదరాబాదులో రాష్ట్ర ముఖ్యమంత్రి ఏ.రేవంత్ రెడ్డి వర్చువల్గా ఏటీసీలను ప్రారంభించారు. ఆలేరులో ఎమ్మెల్యే  ఐలయ్య ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు.ఈ సందర్భంగా విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడుతూ అధునాతన సాంకేతిక పరిజ్ఞానాన్ని గ్రామీణ యువత కు అందుధుబాటులోకి తీసుకువచ్చే ఆలోచనతో సీఎం ఐటీఐలలో ఏటీసీలను నిర్మించినట్లు చెప్పారు. ఏటీసీల్లో శిక్షణ పొందిన యువత కు నేషనల్ మల్టీ నేషనల్ కంపెనీలలో ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించడం జరుగుతుందని చెప్పారు. సాంకేతిక విద్యాభివృద్ధికి ప్రభుత్వం పెద్దపీట వేస్తుందని చెప్పారు.

రూ.40 కోట్లతో ఏర్పాటుచేసిన ఏటీసీలో అధునాతన సాంకేతిక కోర్సుల్లో విద్యార్థులకు ఏడాది, రెండేళ్ల పాటు శిక్షణ ఇవ్వడం జరుగుతుందన్నారు. అనంతరం ఎమ్మెల్యే ఏటీసీలోని అధునాతన సాంకేతిక పరికరాలను పరిశీలించారు. టెక్నికల్ ఇన్స్ట్రక్టర్లు యంత్రాల పనితీరు శిక్షణ వివరాలను ఎమ్మెల్యేకు వివరించారు. ఆలేరు ఐటిఐ ప్రిన్సిపాల్ బి.హరికృష్ణ మాట్లాడుతూ ఏటీసీలో శిక్షణ కోర్సులను విద్యార్థులు సద్వినియోగం చేసుకొని ఉన్నత స్థాయికి ఎదగాలని కోరారు. భవిష్యత్తులో ఏటీసీని స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ గా అప్ గ్రేడ్  చేసేలా చొరవ చూపాలని ప్రిన్సిపాల్ ఎమ్మెల్యేను కోరారు.

ఈ కార్యక్రమంలో జిల్లా అడిషనల్ కలెక్టర్ భాస్కరరావు, రాష్ట్ర మహిళా కో-ఆపరేటివ్ అభివృద్ధి సంస్థ   చైర్ పర్సన్ బండ్రు శోభారాణి, మున్సిపల్ కమిషనర్ శ్రీనివాస్,మార్కెట్ కమిటీ చైర్ పర్సన్ అయినాల చైతన్య రెడ్డి, టిపిసిసి ప్రధాన కార్యదర్శి జనగాం ఉపేందర్ రెడ్డి జనగాం ఉపేందర్ రెడ్డి, ఎంఏ ఇక్బాల్ ఎమ్మెస్ విజయ్ కుమార్ కట్టకముల సాగర్ రెడ్డి నీలం పద్మా వెంకటస్వామిఆరే ప్రశాంత్ బిజిన భాస్కర్ విద్యార్థులు తల్లిదండ్రులు వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -