Sunday, January 11, 2026
E-PAPER
Homeతాజా వార్తలురేషన్ కార్డుదారులకు ప్రభుత్వం శుభవార్త..

రేషన్ కార్డుదారులకు ప్రభుత్వం శుభవార్త..

- Advertisement -

నవతెలంగాణ – హైదరాబాద్: తెలంగాణ ప్రభుత్వం రేషన్ కార్డుదారులకు గుడ్ న్యూస్ చెప్పింది. రేషన్ సేవలపై పూర్తి అవగాహన కల్పించేందుకు ‘T-Ration’ అనే మొబైల్ అప్లికేషన్‌ను అందుబాటులోకి తెచ్చింది. దీని ద్వారా ప్రజలు తమ రేషన్ వివరాలను ఇంటి వద్దనుంచే తెలుసుకోవచ్చు. రేషన్ కార్డు ప్రస్తుతం అమలులో ఉందా లేదా అని తెలుసుకోవచ్చు. కార్డులో ఉన్న సభ్యుల పేర్లు, వారి ఆధార్ సంఖ్యలు రేషన్ కార్డుతో అనుసంధానం అయ్యాయా అనే సమాచారాన్ని కూడా పొందవచ్చు. జీపీఎస్ ద్వారా రేషన్ షాప్ లొకేషన్ కూడా తెలుసుకోవచ్చు. ప్రతి నెలా ఎంత రేషన్ కోటా వస్తుంది, అందులో ఏ ఏ వస్తువులు ఉన్నాయి అనే అంశాలను ఈ యాప్ తెలియజేస్తుంది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -