విద్య సమస్యలపై మండలంలో విస్తృత పర్యటన
నవతెలంగాణ – తాడ్వాయి
విద్యారంగ సమస్యలు పరిష్కరించడంలో ప్రభుత్వం గోరంగా విఫలమైందని ఎస్ఎఫ్ఐ మండల అధ్యక్షులు మంకిడి సాయి చైతన్య ఆరోపించారు. మంగళవారం ఎస్ఎఫ్ఐ విద్యార్థి నాయకులతో కలిసి మండలంలోని పాఠశాలల విద్యార్థుల సమస్యలపై, మండల వ్యాప్తంగా పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ ఈ నెల 23 వ తారీఖున మండల కేంద్రంలో ధర్నా నిర్వహించనున్నట్లు తెలిపారు.
గత ఏడాదిన్నరగా ఫీజు రియంబర్స్మెంట్ స్కాలర్షిప్ విడుదల చేయడంలో ప్రభుత్వం నిర్లక్ష్య ధోరణి విడనాడాలని మండిపడ్డారు. ప్రభుత్వం ఏర్పడి రెండు సంవత్సరాలు గడుస్తున్న విద్యాశాఖకు మంత్రిని నియమించకపోవడం సిగ్గు చేటు అన్నారు. పెండింగ్ స్కాలర్షిప్లు, ప్లీజ్ రియంబర్స్మెంట్ బకాయిలు విడుదల చేయాలని అన్నారు. విద్యార్థులకు మెస్ బిల్లులు పెంచాలని, బస్సు చార్జీలు తగ్గించాలని, విద్యారంగా సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ విద్యార్థి నాయకులు తదితరులు పాల్గొన్నారు.