Saturday, August 2, 2025
E-PAPER
Homeఆదిలాబాద్ప్రభుత్వ ఆస్పత్రిని 30 పడకల హాస్పిటల్ గా అప్గ్రేడ్ చేయాలి: సీపీఐ(ఎం)

ప్రభుత్వ ఆస్పత్రిని 30 పడకల హాస్పిటల్ గా అప్గ్రేడ్ చేయాలి: సీపీఐ(ఎం)

- Advertisement -

పైళ్ళ ఆశయ్య, సీపీఐ(ఎం) రాష్ట్ర కమిటీ సభ్యులు డిమాండ్..
కవ్వాల్ టైగర్ జోన్ఏరియాలో సరైన వైద్యం అందక ప్రాణాలు కోలిపోతున్న ఆదివాసీలు..
నవతెలంగాణ – జన్నారం

మండల కేంద్రంలో ఉన్న ప్రభుత్వ ఆస్పత్రిని 30 పడకల ఆస్పత్రిగా అప్గ్రేడ్ చేయాలని సీపీఐ(ఎం) రాష్ట్ర కమిటీ సభ్యులు ఫైళ్ల ఆశయ అన్నారు. శనివారం జన్నారం సీపీఐ(ఎం) మండల కమిటీ ఆధ్వర్యంలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రం (PHC)ని  సందర్శించి సమస్యలు  తెలుసుకున్నారు. ఈ సందర్భంగా  పైళ్ళ ఆశయ్య మాట్లాడుతూ .. జన్నారం ప్రాథమి ఆరోగ్య కేంద్రని ఆరు పడకల నుంచి 30 పడకల హాస్పిటల్ గా మార్చాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

అదేవిధంగా జన్నారం మండలం చుట్టుపక్కల అనేకమైనటువంటి ఆదివాసి గూడెం, పేదలు టైగర్ జోన్ కవ్వాల్ ఏరియా దీనివల్ల వెనుకబడి ఉన్న ప్రాంతం అనేక ఆదివాసి తెగలు నివసించేటువంటి ప్రాంతాలుగా జన్నారం మండలం ఉన్నందున, ఇక్కడి పేదలు ఆరోగ్యాికి సరైన వైద్యం అందక ప్రాణాలు కోల్పోతున్నారని  ఆవేదన వ్యక్తం చేశారు. ఆదివాసి మహిళలు దళితులు రక్తహీనత టిబి, లివర్, కిడ్నీ జబ్బులతో, ఇబ్బంది పడుతున్నారు. మహిళలకు గైనకాలజిస్ట్ ఏర్పాటు చేయాలని, పెద్ద,పెద్ద రోగాలు వస్తే టెస్టులు సంబంధించి మంచిర్యాలకు, జగిత్యాల పోవాల్సిన పరిస్థితి పేదలకు దాపరించిందని ఆవేదన చెందారు.

గుండె జబ్బులు, కిడ్నీ, లివర్ సంబంధించి వీటి కూడా పరీక్షలు చేసే విధంగా ఇక్కడ ల్యాబ్ ఏర్పాటు చేయాలని ప్రభుత్వాన్ని విజ్ఞప్తిచ్చారు. ఆయుర్వేద హాస్పిటల్ కూడా జన్నారంలో ఉన్నదని దీనికి సంబంధించి రెండు నెలలుగా ప్రత్యేక డాక్టర్ లేకపోవడం రోగులు అందరు కూడా ఇతర ప్రాంతాలకు వెళ్తున్నారని, ఆయుర్వేద డాక్టర్ వెంటనే నియమించాలి, డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సీపీఐ(ఎం) మండల కార్యదర్శి కనికరపు అశోక్, మండల కార్యవర్గ సభ్యులు, కే బుచ్చయ్య, మంగిడి జయ, గుడ్ల రాజన్న, ప్రమీల, పత్రం రవి కుమార్, అంబటి లక్ష్మణ్, ఎస్.కె అబ్దుల్లా, తుడుస్సం గంగు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -