Tuesday, February 17, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్ప్రభుత్వ ఆస్పత్రి కార్మికులకు సమాన వేతనం కల్పించాలి 

ప్రభుత్వ ఆస్పత్రి కార్మికులకు సమాన వేతనం కల్పించాలి 

- Advertisement -

– 12 గంటల విధానం తొలగించాలి 
నవతెలంగాణ – కామారెడ్డి 

కామారెడ్డి జిల్లా ప్రభుత్వ ఆస్పత్రిలో ఏఐటీయూసీ అనుబంధంగా పనిచేస్తున్న తెలంగాణ మెడికల్ ఎంప్లాయిస్ వర్కర్స్ యూనియన్ కామారెడ్డి జిల్లా కమిటీ ఆధ్వర్యంలో మంగళవారం జిల్లా జనరల్ బాడీ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి రాష్ట్ర అధ్యక్షులు ఎండి యూసుఫ్  హాజరై కార్మికుల సమస్యలపై పలు కీలక డిమాండ్లు చేశారు. పిఎఫ్, ఈఎస్ఐ సదుపాయాలను పూర్తి స్థాయిలో అమలు చేయాలని, సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను కోరారు. నరేంద్ర మోడీ ప్రభుత్వం పనిగంటలను 12 గంటలకు పెంచడం వల్ల కార్మికులు శ్రమదోపిడికి గురవుతున్నారని విమర్శించారు. 12 గంటల పని విధానాన్ని వెంటనే ఉపసంహరించుకోవాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

కార్మిక చట్టాల అమలులో కేంద్ర ప్రభుత్వం విఫలమైందని, కార్పొరేట్ సంస్థలకు అనుకూలంగా వ్యవహరిస్తోందని ఆరోపించారు. కామారెడ్డి జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో పనిచేస్తున్న పేషంట్ కేర్ సిబ్బంది, సెక్యూరిటీ గార్డులు, శానిటేషన్ కార్మికులను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలని, కనీస వేతనాలతో పాటు పిఎఫ్, ఈఎస్ఐ అమలు చేయాలని కోరారు. సుప్రీంకోర్టు తీర్పులు, కనీస వేతన చట్టం – 1948 ప్రకారం వేతనాలు చెల్లించాలని తెలిపారు.

గతంలో తీసుకొచ్చిన జీఓ నంబర్ 21 ప్రకారం రూ.18,000 కనీస వేతనం అమలు చేయాలని, ఆ నిర్ణయాన్ని వెనక్కి తీసుకున్నారని పేర్కొంటూ అప్పటి ముఖ్యమంత్రి కె  చంద్రశేఖర రావు  ప్రభుత్వంపై విమర్శలు చేశారు. ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం వెంటనే జీఓ 21ను అమలు చేయాలని పిలుపునిచ్చారు.

ధరల పెరుగుదల నేపథ్యంలో వేతనాలు పెంచాలని, కామారెడ్డి, ఎల్లారెడ్డి, బాన్సువాడ, దోమకొండ, పిట్లం, మద్నూర్, బిచ్కుంద, జుక్కల్ ప్రాంతాల్లో పనిచేస్తున్న కార్మికుల వేతనాలు పెంచకపోతే భవిష్యత్తులో పెద్ద ఎత్తున ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు. ఈ సమావేశంలో రాష్ట్ర అధ్యక్షులు ఎండి యూసుఫ్, జిల్లా గౌరవ అధ్యక్షులు ఎల్. దశరథ్, జిల్లా అధ్యక్షులు కే. శ్రీనివాస్, జిల్లా సహాయ కార్యదర్శి సురేఖ, జిల్లా కోశాధికారి ఎండి రఫీక్, తెలంగాణ రాష్ట్ర రైతు సంఘం కన్వీనర్ ఏం. దేవయ్యతో పాటు పలువురు నాయకులు, కార్మికులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -