Saturday, July 5, 2025
E-PAPER
Homeఆదిలాబాద్విద్యారంగ సమస్యలను పట్టించుకోని ప్రభుత్వం: ఎస్ఎఫ్ఐ

విద్యారంగ సమస్యలను పట్టించుకోని ప్రభుత్వం: ఎస్ఎఫ్ఐ

- Advertisement -

 పెండింగ్లో ఉన్నటువంటి రూ.8000 కోట్ల స్కాలర్షిప్స్ ను, ఫీజు రీయింబర్స్ మెంట్ ను వెంటనే విడుదల చేయాలి. 
ఈర్ల రాహుల్, ఎస్ఎఫ్ఐ భువనగిరి పట్టణ కార్యదర్శి
నవతెలంగాణ  – భువనగిరి
: తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వ  విద్యారంగ  సమస్యలను తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం పట్టించుకోవడంలేదని ఎస్ఎఫ్ఐ భువనగిరి  పట్టణ కార్యదర్శి ఈర్ల  రాహుల్  అన్నారు. శనివారం రోజున స్థానిక ప్రిన్స్ చౌరస్తా వద్ద విద్యార్థులతో నిరసన కార్యక్రమంలో ఈ సందర్భంగా ఈర్ల రాహుల్  మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మూడు సంవత్సరాల నుండి  పెండింగ్లో  ఉన్నటువంటి రూ.8000 కోట్ల స్కాలర్షిప్స్ మరియు ఫీజు రీయింబర్స్ మెంట్ వెంటనే విడుదల చేయాలి అన్నారు.

పేద  మధ్య తరగతి  కుటుంబాల విద్యార్థులు స్కాలర్షిప్స్ ఫీజు రీయింబర్స్ మెంట్ విడుదల కాకపోవడంతో సర్టిఫికెట్లు తీసుకుందామంటే ప్రయివేటు కాలేజీ  యజమాన్యాలు ఇవ్వడం లేదన్నారు. ప్రభుత్వం నుంచి వచ్చే బకాయిలు రాకపోవడంతో విద్యార్థుల దగ్గర సొంత డబ్బులు వసూలు చేస్తున్నారన్నారు. తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ఎస్సీ, ఎస్టి, బిసి, మైనార్టీ, గురుకులాలకు ఎస్ ఎం హచ్ కాలేజీ హాస్టల్స్ కు సొంత భవనలు లేకపోవడంతో విద్యార్థులు అద్దె భవనాల్లో ఉంటూ తీవ్రమైన ఇబ్బందులు పడుతున్నారన్నారు. విద్యార్థులకు సరైన మౌలిక సదుపాయాలు లేకపోవడంతో అద్దె భవనాల్లో  ఉంటూ చదువుకుంటున్నారన్నారు. 

లేదంటే రాబేయే రోజులలో రాష్ట్రవ్యాప్తంగా ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఉద్యమాలు నిర్వహిస్తామని ఈ సందర్భంగా వారు ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ జిల్లా కమిటీ సభ్యులు కరట్లపల్లి భవాని శంకర్, పట్టణ సహాయ కార్యదర్శు సతీష్, నాయకులు సంతోష్, అభిషేక్, కార్తీక్, తిలక్, రాంచరన్, యెషవంత్, ఏలేశ్  పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -