నవతెలంగాణ – వెల్దండ
గ్రామీణ ప్రాంతాల అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం పెద్దపీట వేస్తుందని కల్వకుర్తి ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి అన్నారు. ఆదివారం వెల్దండ మండల పరిధిలోని పెద్దాపూర్ గ్రామంలో రూ 12 లక్షలతో అంగన్వాడి భవన నిర్మాణానికి, కంటోనీ పల్లి గ్రామంలో నూతనంగా నిర్మించిన గ్రామపంచాయతీ భవనాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గ్రామీణ ప్రాంతాల ప్రజల అవసరాల దృశ్య ప్రజాపాలన చేస్తుందన్నారు. ప్రజా అవసరాలను గుర్తించి అభివృద్ధి పనులు చేస్తుందన్నారు. అవసరమైన గ్రామాలను గుర్తించి బి టి రోడ్ల నిర్మాణం చేపట్టడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో పొల్యూషన్ బోర్డు మెంబర్ బాలాజీ సింగ్ , మాజీ సర్పంచ్ భూపతి రెడ్డి, సంజీవ్ కుమార్, మాజీ సర్పంచ్ పెద్ది రామకృష్ణ, సింగిల్ విండో డైరెక్టర్ వెంకటయ్య గౌడ్, పర్వత్ రెడ్డి, కిషోర్ రెడి , కేశమల్ల కృష్ణ, శ్రీనివాస్ యాదవ్, తిరుపతి రెడ్డి , చంద్రశేఖర్, నెంట రాజు, శేఖర్, రాజు, రామస్వామి తదితరులు పాల్గొన్నారు.
గ్రామాల అభివృద్ధికి ప్రభుత్వం పెద్దపీట: ఎమ్మెల్యే కసిరెడ్డి
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES