Saturday, July 19, 2025
E-PAPER
Homeరాష్ట్రీయంమహిళా సాధికారతకు ప్రభుత్వం పెద్దపీట

మహిళా సాధికారతకు ప్రభుత్వం పెద్దపీట

- Advertisement -

– మంత్రి డాక్టర్‌ ధనసరి సీతక్క
నవతెలంగాణ- ములుగు

రాష్ట్రంలో మహిళలు ఆర్థికంగా ఎదగడానికి ప్రజా ప్రభుత్వం ప్రత్యేక కార్యాచరణ రూపొందించిందని, మహిళా సంఘాల్లో నూతన సభ్యులను చేర్పించాలని పంచాయతీరాజ్‌, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ నీటి సరఫరా, మహిళా, శిశు సంక్షేమ శాఖల మంత్రి డాక్టర్‌ ధనసరి సీతక్క అన్నారు. గురువారం ములుగు జిల్లా కేంద్రంలోని గిరిజన భవన్‌లో ఇందిరా మహిళా శక్తి సంబురాల్లో భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు, జిల్లా కలెక్టర్‌ దివాకర టీఎస్‌తో కలిసి మంత్రి పాల్గొన్నారు. వడ్డీ లేని రుణాల చెక్కులు, లోన్‌ బీమా, ప్రమాద చెక్కులను పంపిణీ చేశారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ.. కాంగ్రెస్‌ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మహిళా సంఘాలకు దాదాపు రూ.26వేల కోట్ల బ్యాంక్‌ లింకేజ్‌ రుణాలను పంపిణీ చేశామని అన్నారు. మహిళా సంఘాలకు రూ. లక్షల కోట్లు కేటాయించడంతో పాటు వడ్డీ రుణమాఫీ చేసిన ఘనత తమదేనని తెలిపారు. ప్రభుత్వ ఉద్యోగాల కన్నా ప్రయివేట్‌ రంగంలో పలు వ్యాపారాల్లో మహిళలు రాణించడానికి అవకాశం ఉందని అన్నారు. ప్రభుత్వం కల్పిస్తున్న సంక్షేమ ఫలాలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో అదనపు సీఈఓ సెర్ప్‌ పి.కట్యాయని దేవి, ములుగు మార్కెట్‌ కమిటీ చైర్మెన్‌ రేగ కళ్యాణి, జిల్లా గ్రంథాలయ చైర్మన్‌ బానోత్‌ రవిచందర్‌, స్థానిక సంస్థల అదనపు కలెక్టర్‌ సంపత్‌రావు, సంబంధిత అధికారులు, మండల సమాఖ్య సభ్యులు, ఏపీఎంలు, మహిళలు, ప్రజాప్రతినిధులు, తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -