– 25 కళ్యాణ లక్ష్మి చెక్కులు.. చీరల పంపిణీ..
– జడ్చర్ల శాసనసభ్యులు జనంపల్లి అనిరుద్ రెడ్డి..
నవతెలంగాణ – ఊరుకొండ
మహిళా మనుల అభివృద్ధి కోసం కాంగ్రెస్ ప్రభుత్వం అన్ని విధాలుగా అండగా ఉంటూ మహిళల అభివృద్ధికి పెద్దపీట వేస్తుందని జడ్చర్ల శాసనసభ్యులు జనంపల్లి అనిరుద్ రెడ్డి అన్నారు. సోమవారం ఊరుకొండ మండల కేంద్రంలోని రైతు వేదిక భవనంలో కాంగ్రెస్ మండల అధ్యక్షులు కొమ్మగొని వెంకటయ్య గౌడ్ అధ్యక్షతన ఏర్పాటుచేసిన కల్యాణ లక్ష్మి చెక్కుల పంపిణీ మరియు ఇందిరా మహిళా శక్తి సంబరాలు సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం స్వయం సహాయక సంఘాల మహిళలకు అందజేస్తున్న యూనిఫామ్ చీరల పంపిణీ కార్యక్రమానికి స్థానిక ఎమ్మెల్యే జనంపల్లి అనిరుద్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై పంపిణీ చేశారు.
మండల మహిళా సంఘాలకు యూనిఫామ్ చీరల పంపిణీ, ఊరుకొండ మండలంలో 25 కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులు ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి చేతుల మీదుగా అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. మహిళా సంఘాల అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను వివరించారు. మహిళల ఆర్థిక స్వావలంబన కోసం ప్రభుత్వం కట్టుబడి పనిచేస్తోందని పేర్కొన్నారు. అర్హులైన లబ్ధిదారులకు 25 కళ్యాణ లక్ష్మి మరియు షాదీ ముబారక్ చెక్కులను ఎమ్మెల్యే గారు అందజేశారు. ఈ పథకాలు ఎంతో మంది కుటుంబాల ఆర్థికభారం తగ్గించడంలో కీలకపాత్ర పోషిస్తున్నాయని అన్నారు. కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, మహిళా సంఘాల నాయకులు, అధికారులు, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు మరియు పెద్ద సంఖ్యలో మహిళలు పాల్గొన్నారు.



