నవతెలంగాణ-పాలకుర్తి
ముస్లింల సంక్షేమానికి ప్రభుత్వం పెద్దపీట వేస్తుందని కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు బిర్రు సోమేశ్వర్ అన్నారు. మండలంలోని ఈరవెన్ను లో గల కబరిస్తాన్ ప్రహరీ గోడ నిర్మాణానికి ఎమ్మెల్యే మామిడాల యశస్విని రెడ్డి రెండు లక్షలు మంజూరు చేయడంతో ఆదివారం టీపీసీసీ ఉపాధ్యక్షురాలు హనుమండ్ల ఝాన్సీ రెడ్డి ఆదేశాల మేరకు ముస్లిం పెద్దలతో కలిసి భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా సోమేశ్వర్ మాట్లాడుతూ మజీదులతోపాటు కబరిస్తాన్ లో అభివృద్ధి కోసం ఎమ్మెల్యే యశస్విని రెడ్డి దృష్టి పెట్టారని తెలిపారు. ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలలో ముస్లింలకు ప్రాధాన్యత ఇస్తున్నారని తెలిపారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో ముస్లింలు కాంగ్రెస్ పార్టీకి అండగా ఉండాలని సూచించారు.
ఈ కార్యక్రమంలో ఐలమ్మ మార్కెట్ కమిటీ డైరెక్టర్ గోనె అశోక్ రెడ్డి, యూత్ కాంగ్రెస్ నియోజకవర్గ ఉపాధ్యక్షులు గోనె మహేందర్ రెడ్డి, మాజీ సర్పంచులు కొమురోజు సోమన్న, నాయకులు ముస్కు చంద్రబాబు, సింగిరెడ్డి సత్తిరెడ్డి, తొర్రూర్ సొసైటీ మాజీ చైర్మన్ కూస భాస్కర్, మాజీ ఉపసర్పంచ్ అనంతుల వెంకటేశ్వర్లు, అనుముల రమేష్, ముస్కు కేశవరాం, కొడిశాల బాబు, గోరంతల ఎల్ల స్వామి, ముస్లిం పెద్దలు హబీబ్, అహమ్మద్ తదితరులు పాల్గొన్నారు.