Wednesday, December 31, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్మత్స్య కారుల అభివృద్ధికి ప్రభుత్వం ప్రత్యేక కృషి: ఎమ్మెల్యే

మత్స్య కారుల అభివృద్ధికి ప్రభుత్వం ప్రత్యేక కృషి: ఎమ్మెల్యే

- Advertisement -

వతెలంగాణ- మిర్యాలగూడ
మత్స్యకారుల అభివృద్ధికి ప్రభుత్వం ప్రత్యేక కృషి చేస్తుందని ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి అన్నారు. మిర్యాలగూడ మండలం రుద్రారం గ్రామంలో తెలంగాణ మత్స్య శాఖ ఆధ్వర్యంలో  రుద్రప్ప  చెరువులో బుధవారం చేప పిల్లలను విడిచిపెట్టారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మత్స్య కారులను చేపల పెంపకంలో అభివృద్ధి చేసేందుకు చేప పిల్లల పంపిణీ చేసి వారిని ప్రోత్సహిస్తున్నాం అని అన్నారు. మత్స్య కారులకు, చేపల పెంపకం చేసే రైతులకు ఎల్లప్పుడూ అండగా ఉంటామని వారికి హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో రుద్రారం సర్పంచ్ షేక్ భాను బేగం, సీనియర్ కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, మత్స్య శాఖ అధికారులు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -