Saturday, November 1, 2025
E-PAPER
Homeకరీంనగర్విద్యార్థుల భవిష్యత్తుతో ప్రభుత్వం ఆటలు..

విద్యార్థుల భవిష్యత్తుతో ప్రభుత్వం ఆటలు..

- Advertisement -

నవతెలంగాణ – వేములవాడ: రాష్ట్ర ప్రభుత్వం పెండింగ్‌లో ఉన్న స్కాలర్షిప్‌లు, ఫీజు రీయింబర్స్మెంట్‌లు విడుదల చేయకపోవడాన్ని నిరసిస్తూ భారత విద్యార్థి ఫెడరేషన్ (ఎస్ఎఫ్ఐ) రాజన్న సిరిసిల్ల జిల్లా కమిటీ ఆధ్వర్యంలో శనివారం వేములవాడలో భిక్షాటన కార్యక్రమం నిర్వహించారు. తెలంగాణ తల్లి చౌరస్తా వద్ద విద్యార్థులు, నాయకులు పాల్గొని ప్రభుత్వ నిర్లక్ష్యాన్ని తీవ్రంగా ఖండించారు. ఈ సందర్భంగా ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి మల్లారపు ప్రశాంత్ మాట్లాడుతూ.. ఎన్నికల సమయంలో విద్యార్థులకు హామీలు ఇస్తూ అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం, ఇప్పుడు ఆ హామీలను మరిచిపోయింది అని ఆగ్రహం వ్యక్తం చేశారు. జూబ్లీహిల్స్ ఉపఎన్నికలపై ఉన్న శ్రద్ధ విద్యార్థుల సమస్యలపై ఎందుకు చూపడం లేదో? అని ప్రశ్నించారు. పేద, మధ్యతరగతి కుటుంబాలకు చెందిన విద్యార్థులు స్కాలర్షిప్‌లు, రీయింబర్స్మెంట్‌లపై ఆధారపడి చదువుకుంటున్నారని, ఇవి ఆగిపోవడంతో వారు తీవ్రమైన ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు.

కళాశాలల యాజమాన్యాలు రీయింబర్స్మెంట్ బకాయిలను విద్యార్థుల నుంచే వసూలు చేస్తున్నాయని, ఇది వారి భవిష్యత్తును రోడ్లమీదకు నెట్టేస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు.గత ప్రభుత్వంలానే ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం కూడా విద్యార్థుల సమస్యలను పట్టించుకోకుండా వారసత్వంగా తప్పులను కొనసాగిస్తోంది అని ప్రశాంత్ విమర్శించారు.భిక్షాటనలో పాల్గొన్న ప్రజలు కూడా విద్యార్థుల పోరాటానికి మద్దతు తెలుపుతూ విద్యార్థుల హక్కుల కోసం మేమూ మీతో ఉన్నాంఅని ధైర్యం ఇచ్చారు అని అన్నారు . ప్రభుత్వం తక్షణమే స్కాలర్షిప్‌లు, ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలను విడుదల చేయాలని డిమాండ్ చేశారు. అలాగే జిల్లా ప్రాతినిధ్యం వహిస్తున్న ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ ఈ సమస్యను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ డివిజన్ కార్యదర్శి కడారీ శివ, నాయకులు సాయికుమార్, నందిని, నాగరాణి తోపాటు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -