Saturday, January 24, 2026
E-PAPER
Homeరాష్ట్రీయంవిద్యార్థిహితంగా ప్రభుత్వ జూనియర్‌ కళాశాలు

విద్యార్థిహితంగా ప్రభుత్వ జూనియర్‌ కళాశాలు

- Advertisement -

– తల్లిదండ్రులతో లెక్చరర్లు
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌

విద్యార్థుల హితంగా ప్రభుత్వ జూనియర్‌ కళాశాలలను తీర్చిదిద్దుతున్నట్టు ప్రభుత్వ జూనియర్‌ కళాశాలల లెక్చరర్లు తెలిపారు. శుక్రవారం రాష్ట్రవ్యాప్తంగా 430 ప్రభుత్వ జూనియర్‌ కళాశాలల్లో నిర్వహించిన మెగా పేరెంట్‌ -టీచర్‌ (మెగా పీటీఎం) సమావేశంలో 50 వేల మందికి పైగా తల్లిదండ్రులు పాల్గొన్నారు. ఇంటర్మీడియట్‌ పబ్లిక్‌ పరీక్షల సన్నద్ధతపై వారు సమీక్షించారు. ఈ సందర్భంగా వారికి ప్రభుత్వం ఇస్తున్న ప్రోత్సాహాన్ని వివరించారు. రెండేండ్లలో మరమ్మతులు, వైట్‌ వాషింగ్‌, గ్రీన్‌ బోర్డుల ఏర్పాటు కోసం రూ.56.16 కోట్లు, మరో 41 కళాశాలల కోసం రూ.10.25 కోట్లు, 300 ప్రభుత్వ జూనియర్‌ కళాశాలల్లో కొత్త మరుగుదొడ్లు, తరగతి గదులు, భవనాల నిర్మాణానికి రూ.49.63 కోట్లు, ప్రతి కళాశాలకు ప్రయోగశాల పరికరాల కోసం రూ.50 వేలు, క్రీడా సామాగ్రి కోసం రూ.10 వేలు, ఎక్కువ మంది విద్యార్థులుంటే ఎక్కువ నిధులు మంజూరు చేసినట్టు వారు తెలిపారు. ఫిజిక్స్‌వాలా, ఖాన్‌ అకాడమీ సహకారంతో జేఈఈ, నీట్‌, క్లాట్‌ తదితర పోటీ పరీక్షలకు ఉచిత ఆన్‌లైన్‌ కోచింగ్‌ అందిస్తున్నట్టు చెప్పారు. వీటితో పాటు విద్యార్థుల భద్రత కోసం సీసీటీవీ కెమెరాలు, అగ్నిమాపక భద్రతా చరగ్యలు, విద్యార్థుల మానసిక ఆరోగ్య పరిరక్షణ కోసం టెలిమానస్‌ హెల్ప్‌లైన్‌ 14416, శిక్షణ పొందిన కౌన్సిలర్ల సలహాలతో ప్రోత్సహిస్తు న్నట్టు తెలిపారు. పండుగలా తీర్చిదిద్దిన కళాశాలల్లో పూర్వ విద్యార్థులు విలువైన సూచనలిచ్చారు. కార్యక్రమాన్ని విజయవంతం చేసిన ప్రిన్సిపాల్స్‌, అధ్యాపకులకు ఇంటర్మీడియట్‌ ఎడ్యుకేషన్‌ డైరెక్టర్‌ కృష్ణ ఆదిత్య అభినందనలు తెలిపారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -