- Advertisement -
జిల్లా జాయింట్ కలెక్టర్ అబ్దుల్ అమీద్
నవతెలంగాణ – చిన్నకోడూరు
ప్రభుత్వ భూములు అన్యాక్రాంతం కాకుండా కాపాడాలని జిల్లా జాయింట్ కలెక్టర్ పేర్కొన్నారు. శుక్రవారం చిన్నకోడూరు తాహశీల్దార్ కార్యాలయంలో ప్రభుత్వ భూముల పరిరక్షణ పై అధికారులతో అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గ్రామాల్లో ప్రభుత్వ భూములు అన్యాక్రాంతం కాకుండా చూడాలన్నారు. ప్రభుత్వ భూములు కబ్జాలకు గురైతే తిరిగి స్వాధీనం చేసుకోవాలని తహశీల్దార్లకు ఆదేశాలు ఇచ్చారు. ఈ కార్యక్రమంలో సిద్దిపేట ఆర్డీవో సదానందం, హుస్నాబాద్ ఆర్డీవో రామ్మూర్తి, తహశీల్దార్లు సలీం, అబ్దుల్ రహేమాన్, ఆర్ఐ మల్లికార్జున్, జి పి ఓ లు పాల్గొన్నారు.
- Advertisement -



