Wednesday, July 16, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్భూభారతిలో ప్రభుత్వ భూములను రక్షించాలి..

భూభారతిలో ప్రభుత్వ భూములను రక్షించాలి..

- Advertisement -

అక్రమార్కులకు పట్టాలు చేయకుండా అడ్డుకట్ట వేయాలి..
తెలంగాణ ప్రజా ఫ్రంట్ జిల్లా అధ్యక్షుడు.. పీక కిరణ్
నవతెలంగాణ – మల్హర్ రావు(కాటారం)
: రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న భూభారతిలో భాగంగా ప్రభుత్వ భూములు రక్షించాలని తెలంగాణ  ప్రజాప్రంట్ భూపాలపల్లి జిల్లా అధ్యక్షుడు పీక కిరణ్ కోరారు. మంగళవారం కాటారంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. భూ కబ్జాదారులు అక్రమార్కులు ప్రభుత్వ భూములకు పట్టాల కొరకు దరఖాస్తులు పెట్టుకున్నట్లుగా దృష్టికి వచ్చిందన్నారు. కాటారం డివిజన్ పరిధిలోని రెవెన్యూ భూములు ఆక్రమణకు గురయ్యాయన్నారు.

కాటారం డివిజన్లో కాటారం, మహా ముత్తారం, మహాదేవపూర్, పలిమెల, మల్హర్ మండలాలు తోపాటు, గ్రామాల్లో ప్రభుత్వ భూములు, సీలింగ్ భూములు, బంజరు భూములు, దేవాదాయ భూములు, గైరాన్ భూములు , అసైన్డ్ భూములు, ఇనాం భూములు, చెరువు ఎస్సీ కార్పొరేషన్ భూములు, చెరువు శిఖం భూములను కొంతమంది కబ్జాదారులు ఆక్రమించుకొని సాగు చేసుకుంటున్నారని తెలిపారు. అక్రమార్కులు తప్పుడు డాక్యుమెంట్లను సృష్టించి పట్టాల కోసం భూభారతిలో దరఖాస్తులు పెట్టుకున్నారని పేర్కొన్నారు. అట్టి దరఖాస్తులను క్షుణ్ణంగా పరిశీలన చేసి ప్రత్యేక దృష్టి సారించి పట్టాలు చేయకుండా అడ్డుకట్ట వేసి భావితరాల కోసం ప్రభుత్వ భూములను రక్షించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -