Tuesday, October 14, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్చేపపిల్లల పంపిణీలో ప్రభుత్వ నిర్లక్ష్యం ..

చేపపిల్లల పంపిణీలో ప్రభుత్వ నిర్లక్ష్యం ..

- Advertisement -

– ముదిరాజ్ మహాసభ హుస్నాబాద్ మండల అధ్యక్షులు పొన్నబోయిన శ్రీనివాస్ ముదిరాజ్
నవతెలంగాణ – హుస్నాబాద్ రూరల్ 

రాష్ట్ర వ్యాప్తంగా చెరువు, కుంటలు నిండి 2 నెలలు గడుస్తున్న  ప్రభుత్వం ఇప్పటివరకు ఉచిత చేపపిల్లలు పంపిణి చేయకపోవడం లో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందని ముదిరాజ్ మహాసభ హుస్నాబాద్ మండల అధ్యక్షులు పొన్నబోయిన శ్రీనివాస్ ముదిరాజ్ మంగళవారం ఒక ప్రకటనలో ఆరోపించారు. రాజకీయాల మీద పడి సంక్షేమం ,అభివృద్ధి కార్యక్రమాలను మరిచారని అన్నారు. చేప పిల్లల పంపిణీ కార్యక్రమానికి టెండర్లు వేసి పంపిణీ చేయాల్సి ఉన్నప్పటికీ అవేమీ చేయడం లేదన్నారు. మత్స్యకారులు అంటే ప్రభుత్వాలకు, నాయకులకు అంత చులకనగా కనపడుతున్నారా అని ప్రశ్నించారు.  ప్రజల ఆరోగ్యాల కోసం మంచి పోషకాలు అందించే నాణ్యమైన ఆహరం అందించడం కోసం పనిచేస్తున్న మత్స్యకారులకు ప్రభుత్వం సహకరించాలన్నారు. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న సొసైటీలకు చేపపిల్లల కొనుగోలు కోసం ప్రభుత్వం నేరుగా సంఘాల ఖాతాలకు డబ్బులు జమచేయాలని డిమాండ్ చేశారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -