విభజన సరికాదు అర్హులందరికీ ఒకేతరహా కార్డులివ్వాలి
సమాచార శాఖ డైరెక్టర్, అదనపు డైరెక్టర్‌కు ఫెడరేషన్ వినతి
నవతెలంగాణ ప్రత్యేక ప్రతినిధి-హైదరాబాద్
జర్నలిస్టులకు కొత్త అక్రెడిటేషన్ కార్డుల జారీకి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన జీవో 252లో అనేక లోపాలున్నాయనీ, వెంటనే వాటిని సవరించి జర్నలిస్టులకు న్యాయం చేయాలని టీడబ్ల్యూజేఎఫ్, హెచ్‌యూజే సంఘాలు రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశాయి. సోమవారం సమా చార శాఖ డైరెక్టర్ కిషోర్‌బాబు, అడిషనల్ డైరెక్టర్ జగన్‌ను వేర్వేరుగా కలిసి వినతిపత్రాలు అందజే శారు. కొత్తగా అక్రిడిటేషన్లు ఇచ్చేందుకు ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని స్వాగతిసున్నామనీ, ఇందుకు సీఎం రేవంత్ రెడ్డి, సమాచార శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, సమాచార శాఖ కమిషనర్ సిహెచ్ ప్రియాంకకు కతజ్ఞతలు తెలియ జేశారు. అయితే జీవోలో పొందుపరిచిన కొన్ని నిబంధనలు జర్నలిస్టులను గందరగోళానికి గురిచే సేలా ఉన్నాయని అధికారుల దృష్టికి తెచ్చారు.
జీవో 252లో జర్నలిస్టులను రెండు తరగతులుగా విభజిస్తూ విధానం రూపొందించడం సరికాదని ఫెడరేషన్ నాయకులు అభిప్రాయపడ్డారు. రిపోర్టర్లకు అక్రిడిటేషన్ అని, డెస్క్ జర్నలిస్టులకు మీడియా కార్డు అని పేర్లు పెట్టి విభజించడం వల్ల డెస్క్‌లో పనిచేసేవారికి తీవ్ర అన్యాయం జరుగుతున్నదన్నారు. ఇప్పటికే కేంద్రం ప్రభుత్వం రైల్వే పాసులు రద్దుచేసిందనీ, ఆర్టీసీ బస్సు పాసుల రాయితీ కూడా తగ్గించారని గుర్తు చేశారు. ఇప్పుడు మీడియా కార్డు పేరుతో డెస్క్ జర్నలిస్టులకు బస్‌పాస్ సౌకర్యం బంద్ అయ్యే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ నిర్ణయాన్ని వెంటనే వెనక్కి తీసుకోవాలని కోరారు. డెస్కు జర్నలిస్టులకు కూడా రిపోర్టర్ల మాదిరిగానే అక్రిడిటేషన్ కార్డులు ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. కొత్త నిబంధనల వల్ల చిన్న, మధ్య తరహా పత్రికలకు సైతం అక్రిడిటేషన్లు దక్కకుండా పోతున్నాయని చెప్పారు. గతంతో పోలిస్తే భారీగా కార్డుల సంఖ్యను తగ్గించారని గుర్తు చేశారు. దీనివల్ల వందలాది మంది వర్కింగ్ జర్నలిస్టులకు అక్రిడ ిటేషన్ అంద కుండా పోతుందని ఆవేదన వ్యక్తం చేశారు. అర్హులైన ప్రతి జర్నలిస్టుకు అక్రిడిటేషన్ కార్డు ఇవ్వాల్సిందేనని టీడబ్ల్యూజేఎఫ్, హెచ్‌యూజే నేతలు డిమాండ్ చేశారు. జీవో 252 లోపాలను సవరించి, డెస్క్ జర్నలిస్టులను, చిన్న, మధ్య తరహా పత్రికలను ఆదుకోవాలని కోరారు. కాగా, దీనిపై అదనపు డైరెక్టర్ జగన్ స్పందిస్తూ మీడియా కార్డుల కు, అక్రిడిటేషన్ కార్డులకు ఒకే రకమైన సౌకర్యాలు ఉంటాయని చెప్పారు. డెస్క్ జర్నలిస్టులకు బస్‌పాస్ ఉండదనేది అసత్య ప్రచారమని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో టీడబ్ల్యూజేఎఫ్ రాష్ట్ర అడ్‌హక్ కమిటీ కన్వీనర్ పిల్లి రాంచందర్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బి బసవపున్నయ్య, రాష్ట్ర ఉపాధ్యక్షులు బి.రాజశేఖర్, గుడిగ రఘు, హెచ్‌యూజే కార్యదర్శి బి జగదీశ్, వర్కింగ్ ప్రెసిడెంట్ గండ్ర నవీన్, ఉపాధ్యక్షులు బి దామోదర్, డెస్క్ జర్నలిస్టులు ఉపేందర్, మస్తాన్, సురేష్, కిరణ్, నరేష్, విజయభాస్కర్ తదితరులు పాల్గొన్నారు.
ఇండ్ల స్థలాలు, హెల్త్ కార్డులు ఇవ్వాలి
జర్నలిస్టులకు పెండింగ్‌లో ఉన్న ఇండ్ల స్థలాల సమస్యను వెంటనే పరిష్కరించాలని టీడబ్ల్యూజేఎఫ్, హెచ్‌యూజే నేతలు కోరారు. ప్రభుత్వ ఉద్యోగుల మాదిరిగానే జర్నలిస్టులకు కూడా ఆరోగ్య విధానాన్ని (హెల్త్ స్కీమ్) అమలు చేయాలన్నారు. రిటైర్డ్ జర్నలిస్టులకు పెన్షన్ సౌకర్యం కల్పించాలనీ, మహిళా జర్నలిస్టులకు రాత్రి పూట రవాణా సౌకర్యం కల్పించేలా చర్యలు తీసుకోవాలని టీడబ్ల్యూజేఎఫ్, హెచ్‌యూజే, నాయకులు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.
జర్నలిస్టుల అక్రిడిటేషన్ల జీవో 252ను సవరించాలి
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



