Friday, August 8, 2025
E-PAPER
spot_img
Homeకరీంనగర్జీవో నెంబర్ 25 సవరించి, విద్యార్థులందరికీ గుణాత్మకమైన విద్యను అందించాలి

జీవో నెంబర్ 25 సవరించి, విద్యార్థులందరికీ గుణాత్మకమైన విద్యను అందించాలి

- Advertisement -

– డిటిఎఫ్ జిల్లా కార్యదర్శి ఏ బూసి శ్రీనివాస్
నవతెలంగాణ జమ్మికుంట

జీవో నెంబర్ 25ను సవరించి, విద్యార్థులందరికీ గుణాత్మకమైన విద్యను అందించాలని డిటిఎఫ్ జిల్లా కార్యదర్శి, జమ్మికుంట జోన్ కన్వీనర్ ఎ బూ షి శ్రీనివాస్ గురువారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ప్రభుత్వ పాఠశాలలో 60 మంది పిల్లలకి ఇద్దరే ఉపాధ్యాయులు ఉండాలనే నిబంధన ప్రకారము విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించడం ఎలా సాధ్యమవుతుందని ఆయన ప్రశ్నించారు. ప్రభుత్వ పాఠశాలలోపనిచేస్తున్న ఉపాధ్యాయులను సర్దుబాటు చేయడం కోసం, జీవో నంబర్ 25 అమలు చేయాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము నిర్ణయము తీసుకోవడం సరికాదన్నారు. ఇది విద్యార్థులకు విద్యను దూరం చేయడమే కాకుండా, పూర్తిగా ఆశాస్త్రీయమైనదని ఆయన విమర్శించారు.

పేద, మధ్యతరగతి విద్యార్థులకు విద్యను దూరం చేయడమే తప్ప మరొకటి కాదన్నారు. ఈ జీవో ప్రకారం 60 మంది విద్యార్థులు ఉంటే ఇద్దరు టీచర్లే పని చేయాలనే నిబంధన ప్రకారము 18 సబ్జెక్టులు ఎలా బోధిస్తారని పిల్లల తల్లిదండ్రులు ప్రశ్నిస్తున్నారని ఆయన తెలిపారు.వారి పిల్లలకు ప్రభుత్వ పాఠశాల లో మంచి విద్య దొరకదని భావించి, ఈ విధానం వలన విద్యార్థులకు, చాలా అన్యాయం జరుగుతుందని,నాణ్యమైన విద్య అందకపోవడం వలన తల్లిదండ్రులు వారి పిల్లలను ప్రైవేటు పాఠశాలకు పంపించే అవకాశం ఉంటుందన్నారు.దీనివలన ప్రభుత్వ ప్రాథమిక విద్య నిర్వీర్యం అయిపోయి, విద్య వ్యవస్థ కుంటూ పడుతుందని ఆయన తెలిపారు. ఆ శాస్త్రీయమైన ఈ జీవోను వెంటనే సవరించాలని ఆయన ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ప్రతి ప్రాథమిక పాఠశాలలో ఒక ప్రధానోపాధ్యాయులు , నలుగురు ఉపాధ్యాయులు పనిచేసే విధంగా తగు చర్యలు చేపట్టాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆయన కోరారు.

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img