నవతెలంగాణ – కుభీర్ : గ్రామల్లో ఉన్న మహిళా సంఘాలు మరింతగా అభివృద్ది చెందేందుకు ప్రభుత్వం అన్ని రకాల చర్యలు తీసుకుంటుందని ముధోల్ ఎమ్మెల్యే పవర్ రామారావు పటేల్ అన్నారు. గురువారం మండలంలోని పార్డి (కే ) గ్రామంలో ప్రభుత్వం మహిళా సమైక్య భవన నిర్మాణానికి 10 లక్షలు నిధులు మంజూరు చేయడంతో వాటి పనులను స్థానిక సర్పంచ్ గంగామణి సత్యనారాయణ తో కలిసి భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా అక్కడ ఏర్పాటు చేసిన సమావేశాలలో ఎమ్మెల్యే మాట్లాడుతూ మండలంలో ఉన్న అన్ని గ్రామపంచాయతీలో నూతన సమైక్య భవన నిర్మాణాలకు నిధులు మంజూరు కావడం జరిగిందని తెలిపారు. వాటి పనులను కూడా త్వరలో ప్రారంభించి మహిళలకు అన్ని విధాలుగా బ్యాంకు రుణాలు పావలా వడ్డీలతో రుణాలు మంజూరు చేసి వారి అభివృద్ధికి కృషి చేస్తామని అన్నారు. అనంతరం ఎమ్మెల్యేకు భైంసా చైర్మన్ స్థానిక సర్పంచ్ గ్రామస్తులు షాలో పూలమాలతో ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో బైంసా మున్సిపాలిటీ చైర్మన్ తూము దత్తాత్రి మండల బిజెపి అధ్యక్షుడు ఏ చాలా దత్తాత్రి మండల నాయకులు వడ్డం నాగేష్ గులాబ్ మహిళలు ఆయా గ్రామాల సర్పంచులు మండల నాయకులు గ్రామస్తులు ఐకేపి సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
మహిళా సంఘలు బలోపేతం చేసేందుకు ప్రభుత్వం స్వంత భవనాలు
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



