నవతెలంగాణ – మల్హర్ రావు
మండల కేంద్రమైన తాడిచెర్ల గ్రామ సర్పంచ్ గా ఇటీవల నూతనంగా ఎన్నికైన బండి స్వామిని మంగళవారం తెలంగాణ ప్రభుత్వ పెన్షనర్స్ అసోసియేషన్ మంథని మండల శాఖ ఆధ్వర్యంలో ఘనంగా సత్కారం చేశారు. ఈ సందర్భంగా పెన్షనర్స్ గృహ సందర్శన కార్యక్రమంలో సమావేశం నిర్వహించి పలు సమస్యలతో పాటు, లైఫ్ మెంబర్షిప్ ను వారి పెన్షనర్స్ లైఫ్ సర్టిఫికెట్ను కూడా సమర్పించాలని కోరారు.కొందరి లైఫ్ సర్టిఫికెట్స్ కూడా ఆన్లైన్లో ద్వారా చేయడం జరిగినదని తెలిపారు. ఈ కార్యక్రమంలో మంథని మండల్ శాఖ కార్యవర్గంలోని అధ్యక్షులు మోహన్ శర్మ, కార్యదర్శి సుధాకర్ రెడ్డి, ఆర్గనై జింగ్ సెక్రటరీ కుక్క డపు రామయ్య, జిల్లా అసోసియేటెడ్ అధ్యక్షులు రాముడు మారుతి, శ్రీ అసోసియేటెడ్ అధ్యక్షులు సత్యనారాయణ, శంకర్ లింగం, మల్క మధుసూదన్, డి. రాజేశ్వరరావు, మల్క వెంకటేశ్వరరావు, మల్క కోoడయ్య, వానమామలై కృష్ణమాచార్యులు, రేకుట్ల సమ్మక్క, కారు పాకల రామక్క పాల్గొన్నారు. అనంతరం మంతని కార్యవర్గ సభ్యులకు శాలువాలతో సన్మానం నిర్వహించారు.
తాడిచెర్ల సర్పంచ్ బండి స్వామికి ప్రభుత్వ పెన్షనర్స్ సత్కారం
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



