Saturday, October 25, 2025
E-PAPER
Homeప్రధాన వార్తలుప్రభుత్వ స్థలాలు కాపాడాలి

ప్రభుత్వ స్థలాలు కాపాడాలి

- Advertisement -

జీహెచ్‌ఎంసీ పార్కును పరిశీలించిన సీఎం రేవంత్‌రెడ్డి

నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్‌
జూబ్లీహిల్స్‌ రోడ్‌ నెంబర్‌ 45లో నిర్మాణంలో ఉన్న జీహెచ్‌ఎంసీ పార్కు పనులను శుక్రవారం రాష్ట్ర ముఖ్యమంత్రి ఎ.రేవంత్‌రెడ్డి ఆకస్మికంగా పరిశీలించారు. పలు వివాహ, శుభకార్యాలకు వెళ్లి తిరిగి వెళ్లే క్రమంలో పార్కు వద్ద ఆగారు. లోపలికి వెళ్లి అక్కడ జరుగుతున్న పనులను పరిశీలించారు. వివరాలు అడిగి తెలుసుకున్నారు. అక్కడ పనిచేస్తున్న కూలీలను అప్యాయంగా పలుకరించారు. చెత్తా చెదారంతో నిండి ఉన్న ప్రభుత్వ స్థలం కబ్జాకు గురికాకుండా పార్కు నిర్మాణం చేయాలని గతంలో జీహెచ్‌ఎంసీ అధికారులను సీఎం రేవంత్‌రెడ్డి ఆదేశించిన విషయం విదితమే.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -