Friday, February 20, 2026
E-PAPER
Homeఆదిలాబాద్ప్రభుత్వ కొనుగోళ్లు కేంద్రాలను ఏర్పాటు చేయాలి

ప్రభుత్వ కొనుగోళ్లు కేంద్రాలను ఏర్పాటు చేయాలి

- Advertisement -

– మాజీ ఎమ్మెల్యే కు వినతిపత్రం అందజేత..
నవతెలంగాణ- కుభీర్
మండల కేంద్రంలోని  కుబేరులోని  వ్యవసాయ మార్కెట్ కార్యాలయం లో ప్రభుత్వ కొనుగోలు కేంద్రాలను  ఏర్పాటు కు కృషి చేయాలని కోరారు. ఈ మేరకు శుక్రవారం  స్థానిక మార్కెట్ కార్యాలయ నికి వచ్చిన మాజీ ఎమ్మెల్యే విట్టల్   రెడ్డికి  వినతి పత్రం అందజేశారు . ఈ సందర్భంగా మార్కెట్ కమిటీ చైర్మన్  కళ్యాణ్ మాట్లాడుతూ రైతులు ఆరుగాలం వాననక ఎండనక  పండించిన పంటలకు సరైన మద్దతు ధర లేక తీవ్రంగా నష్టపోతున్నారని అన్నారు.

ప్రభుత్వం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయకపోవడంతో దళారులకు పంటలను అమ్మి  నష్టపోతున్నారని  రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కి  కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసేలా సిఫారసు చేయాలని కోరారు. మాజీ ఎమ్మెల్యే విట్టల్ రెడ్డి సానుకూలంగా  స్పందిస్తూ త్వరలోనే రైతుల సమస్యలను ప్రభుత్వ దృష్టికి తీసుకువెళ్లి కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసేలా కృషి చేస్తానని రైతులకు భరోసా ఇచ్చారు . కుభీర్ సర్పంచ్ కందురు సాయినాథ్, మాజీ సర్పంచ్ విజయ్ కుమార్,మాజీ వ్యవసాయ సహకార సంఘం చైర్మన్ దంతుల రాములు , సూది రాజన్న మండల నాయకులు రైతులు తదితరులు ఉన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -