Tuesday, January 13, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్ప్రభుత్వ పథకాలు ప్రజలకు అందించాలి 

ప్రభుత్వ పథకాలు ప్రజలకు అందించాలి 

- Advertisement -

విద్యుత్ డి ఈ చంద్రమౌళి 
నవతెలంగాణ – మిడ్జిల్ 

ప్రభుత్వం తీసుకొస్తున్న పథకాలను అర్హులైన ప్రజలందరికీ అందించే బాధ్యత అధికారుల పైన ఉందని, జిల్లా అధికారి చంద్రమౌళి అన్నారు. మంగళవారం మండల కేంద్రంలో గృహ జ్యోతి పథకంలో భాగంగా ఉచిత 200 యూనిట్ విద్యుత్ పేపర్లను లబ్ధిదారులకు కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు అల్వాల్ రెడ్డి,  ఏడి చంద్రశేఖర్ తో కలిసితో కలిసి అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పేద వర్గాల కోసం ప్రభుత్వం తీసుకొస్తున్న సంక్షేమ పథకాలను సద్వినియోగం చేసుకోవాలని కోరారు. మండలంలో గృహ జ్యోతి పథకం కింద 5019 మంది కుటుంబాలకు 200 యూనిట్లు ఉచిత విద్యుత్తును ప్రభుత్వం అందిస్తుందని తెలిపారు.

ఒక కుటుంబానికి నెలకు వెయ్యి రూపాయల వరకు పేదల కోసం ప్రభుత్వమే విద్యుత్ బిల్లులు చెల్లిస్తుందని చెప్పారు. గృహ జ్యోతి లబ్ధిదారులు విద్యుత్ బిల్లులు ఖర్చులు పేద పిల్లల చదువులకు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. మండలంలో విద్యుత్ సమస్య లేకుండా చూసుకునే బాధ్యత సిబ్బందిపై ఉందని తెలిపారు. ప్రజలందరూ కూడా విద్యుత్ మంజూరు  దరఖాస్తు చేసుకొని కరెంటు వాడుకోవాలని సూచించారు. కార్యక్రమంలో మిడ్జిల్ ఏఈ నరేందర్ గౌడ్, కాంగ్రెస్ పార్టీ జిల్లా నాయకులు సుదర్శన్ రెడ్డి, సబ్ ఇంజనీర్ విజయ్. గ్రామ సర్పంచ్ ఎడ్ల శంకర్ మల్లికార్జున్ రెడ్డి, జగన్మోహన్ రెడ్డి , జహీర్,గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -