Tuesday, August 19, 2025
E-PAPER
spot_img
Homeజిల్లాలుశిథిలావస్థలో ప్రభుత్వ పాఠశాల.. పెచ్చులూడుతున్న పైకప్పులు

శిథిలావస్థలో ప్రభుత్వ పాఠశాల.. పెచ్చులూడుతున్న పైకప్పులు

- Advertisement -

– భయందనలు విద్యార్థుల తల్లిదండ్రులు.. 
– నిరాశ , నిస్పౄహలో స్కూలు ఉపాధ్యాయులు..
నవతెలంగాణ – జుక్కల్

మండలంలోని బిజ్జల్ వాడి గ్రామంలోని మండల పరిషత్ పాఠశాల శిథిలావస్థకు చేరింది. గత 15 – 16 ఏళ్లుగా ఈ శిథిలమైన పాఠశాలలోని విద్యను కొనసాగిస్తున్నారు. విద్యార్థులు పాఠశాలకు రావాలంటే జంకుతున్నారు. వర్షాకాలం ఉన్నందున పైకప్పు నుండి నీరు పాఠశాలో లోపలి భాగంలో కారుతోంది. పెచ్చులు ఊడి పెల్లలు క్రిందకు పడిపోతున్నాయి. గోడలన్నిటికీ చీలికలు వచ్చి సందులు ఏర్పడ్డాయి. పాఠశాల ఎప్పుడు కూలిపోతుందోనని విద్యార్థులు క్షణం క్షణం భయంతో జంకుతున్నారు. పాఠశాలకు విద్యార్థులు రావడం లేదని, వారి ఇండ్లకు పోయి తల్లిదండ్రులకు ఎంత అవగాహన పరిచినా పాఠశాలకు రావడం లేదు. విద్యార్థులను పాఠశాలకు పంపడానికి తల్లిదండ్రులే సుముఖంగా లేరు. భయం నీడలో పాఠశాల కొనసాగుతుందని, అందుకే పాఠశాలకు పంపాలంటే భరోస లేదని విద్యార్థుల తల్లిదండ్రులు అంటున్నారు. శిథిలమైన పాఠశాలకు రాకుండా తల్లిదండ్రులే పంపడం లేదని, పాఠశాల కూలిపోయి ప్రమాదం జరిగి ఏదైనా సమస్య తలెత్తితే ఎవరు బాధ్యులుగా ఉంటారని తిరగు ప్రశ్నలు అడుగుతున్నారని హెచ్ఎం ఉపాధ్యాయుడు ఇషాంత్ వార్ రవి కుమార్ అన్నారు. 

ఈ పాఠశాలలో మొత్తం 30 మంది విద్యార్థులు విద్యను అభ్యసిస్తున్నారు. ప్రస్తుతము పాఠశాలకు ఇద్దరు, ముగ్గురు విద్యార్థులు తప్ప మిగతా విద్యార్థులు పాఠశాలకు రావడం లేదని తెలిసింది. విద్యార్థుల తల్లిదండ్రులు ఎంత ఖర్చైనా పర్వాలేదని, తమ పిల్లలను ప్రయివేట్ పాఠశాలలకు పంపించేందుకు సుముఖత చూపిస్తున్నాన్నారని గ్రామస్తులు తెలిపారు. ప్రభుత్వ పాఠశాలలో చదివే పేద, బడుగు, బలహీన వర్గాల  విద్యార్థులకు తీవ్ర అన్యాయం జరుగుతుందని గ్రామ ప్రజలు అంటున్నారు. ప్రభుత్వ విద్య.. పేదలకు అందని ద్రాక్ష అని పలువురు విమర్శిస్తున్నారు. ఈ పాఠశాల శిథిలావస్థలో ఉందని ప్రభుత్వ అధికారులకు, రాజయకీయ నాయకులకు ఎన్నిసార్లు చెప్పినా..ఇప్పటిదాకా ఎవరూ స్పందించలేదని గ్రామస్థులు తెలిపారు. ఇది ఇలాగే కొనసాగితే రాబోయే రోజులలో గ్రామంలోని ఎంపీపీ ఎస్ పాఠశాలకు  ఒక్క విద్యార్థి కూడా రారని వారు స్పష్టం చేశారు. ఇప్పటికైనా జిల్లా యంత్రాంగం స్పందించి, ఈ గ్రామానికి నూతన ప్రభుత్వ పాఠశాల మంజూరు చేయాలని, తద్వారా పేద ప్రజల పిల్లలు చదువుకు దూరం కాకుండా చూడాల్సిన భాద్యత ప్రతీ అధికారిపై ఉందని గ్రామ యువకులు గుర్తు చేశారు.

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img
Ad
Ad