Friday, June 20, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్ప్రభుత్వ పాఠశాల సమస్యలు పరిష్కరించాలి: ఏఐఎస్ఎఫ్

ప్రభుత్వ పాఠశాల సమస్యలు పరిష్కరించాలి: ఏఐఎస్ఎఫ్

- Advertisement -

నవతెలంగాణ – పెద్దవూర : జిల్లాలో ఉన్నటువంటి ప్రభుత్వ పాఠశాలల సమస్యలు వెంటనే పరిష్కారం చేయాలని ఏఐఎస్ఎఫ్ జిల్లా కార్యదర్శి ముదిగొండ మురళీకృష్ణ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. గురువారం పెద్దవూర మండల కేంద్రంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో విద్యార్థులను కలిసి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. పాఠశాల విద్యార్థులకు యూనిఫామ్, పుస్తకాలు,నోట్బుక్ లు వెంటనే అందజేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. అలాగే విద్యార్థులకు సరిపడ బాత్రూంలు, మరుగుదొడ్లు,మంచినీటి సౌకర్యం కల్పించాలని అన్నారు. జిల్లాలో చాలా పాఠశాలల భవనాలు శిథిలావస్థలో ఉన్నాయని వెంటనే కొత్త భవనాలు నిర్మించాలని, ఖాళీగా ఉన్న నాన్ టీచింగ్ పోస్టులను భర్తీ చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. రాష్ట్రవ్యాప్తంగా అన్ని ప్రభుత్వ పాఠశాల సర్వే నిర్వహించి, పోరాటాలు చేస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో సంఘం జిల్లా ఉపాధ్యక్షులు రమావత్ శోభన్ బాబు, మండల నాయకులు తరుణ్, నగేష్,గోపాల్,నాగేందర్, లక్ష్మీ, స్వరూప పాల్గొన్నారు. 

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -