– చదువుల్లో అంతరాలు పోవాలి
– మాజీ ఎమ్మెల్సీ, పౌర స్పందన వేదిక రాష్ట్ర అధ్యక్షులు నర్సిరెడ్డి
నవతెలంగాణ-మిర్యాలగూడ
ప్రభుత్వ బడులలో అంతరాలు లేని విద్య రావాలని, ప్రీ ప్రైమరీ స్కూల్స్ ప్రారంభించాలని మాజీ ఎమ్మెల్సీ, తెలంగాణ పౌరస్ స్పందన వేదిక రాష్ట్ర అధ్యక్షులు అలుగుబెల్లి నర్సిరెడ్డి అన్నారు. తరగతికి ఒక గది.. ఒక ఉపాధ్యాయుడు ఉండేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని కోరారు. ప్రభుత్వ బడులు నిలబడాలి.. చదువుల్లో అంతరాలు పోవాలి.. ప్రభుత్వ బడుల్లో ప్రీ ప్రైమరీ స్కూల్స్ ప్రారంభించాలని కోరుతూ తెలంగాణ పౌర స్పందన వేదిక ఆధ్వర్యంలో చేపట్టిన ప్రచార జాతా మంగళవారం నల్లగొండ జిల్లా మిర్యాలగూడ పట్టణ కేంద్రానికి చేరుకుంది. అమరవీరుల స్థూపం వద్ద జరిగిన సభలో ఆయన మాట్లాడుతూ.. బడీడు పిల్లల సంఖ్య ఆధారంగా గ్రామీణ ప్రాంతంలో పాఠశాలలన్నింటినీ రీఆర్గనైజ్ చేయాలన్నారు. ఇతర ఆవాస్ నుంచి బడికి రావాల్సిన విద్యార్థుల కోసం ఉచిత బస్సు సౌకర్యం కల్పించాలన్నారు. కేంద్ర ప్రభుత్వం బడ్జెట్లో విద్యకు పది శాతం నిధులు కేటాయించాలని, రాష్ట్రంలో ప్రాథమిక పాఠశాలల్లో ప్రీ ప్రైమరీ తరగతుల ఏర్పాటుకు కేంద్రం రూ.5వేల కోట్లు ప్రత్యేక గ్రాంట్లు ఇవ్వాలని డిమాండ్ చేశారు. క్రమంగా అంతరాలు లేని బడులను అభివృద్ధి చేసి పేద, ధనిక తేడా లేకుండా అందరూ ఒకే బడిలో.. ఒకే తరగతి గదిలో చదువుకునే పరిస్థితులు కల్పించాలన్నారు. పౌర సమాజం మేల్కొని ప్రభుత్వ పాఠశాలల బలోపేతానికి సహకరించాలని కోరారు. ఈ జాతకు ప్రజా సంఘాలు మద్దతు తెలిపాయి. ఈ కార్యక్రమంలో టీపీఎస్సీ సూర్యాపేట జిల్లా అధ్యక్షులు ఆర్.ధనమూర్తి, టీఎస్ యూటీఎఫ్ రాష్ట్ర కార్యదర్శి జి.నాగమణి, జిల్లా అధ్యక్షులు బి.శ్రీనివాస్ చారి, కార్యదర్శలు ఎం.శ్రీనివాస్ రెడ్డి, ఏ.చిన్న వెంకన్న, జి.వేదశ్రీ, టాప్రా నాయకులు పి.రమణారెడ్డి, పి.సత్యనారాయణ రావు, ఎల్.మాధవరెడ్డి, ప్రజా సంఘాల ఐక్యవేదిక నాయకులు రామయ్య, డీవైఎఫ్‌ఐ జిల్లా అధ్యక్షులు రవి నాయక్, ఎస్‌ఎఫ్‌ఐ రాష్ట్ర నాయకులు సైదా నాయక్ పాల్గొన్నారు.
ప్రభుత్వ బడులు నిలబడాలి
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES