నవతెలంగాణ – యాదగిరిగుట్ట రూరల్
ప్రభుత్వం విద్య, వైద్యానికి పెద్ద పీట వేసిందని, ప్రయివేట్ పాఠశాలలకు దీటుగా ప్రభుత్వ పాఠశాలలు మెరుగైన విద్యాబోధన అందిస్తున్నారని యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్ హనుమంతరావు అన్నారు. శుక్రవారం, యాదగిరిగుట్ట మండలం వంగపల్లి, జిల్లా పరిషత్ హైస్కూల్ లో విద్యార్థులకి స్పోర్ట్స్ డ్రెస్ లు జిల్లా కలెక్టర్ పంపిణీ చేశారు. ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ స్కూల్స్ ను బలోపేతం చేయడానికి టీచర్లు కృషి చేయాలి అన్నారు. ప్రభుత్వ పాఠశాలల పై నమ్మకం కలిగేలా ఉపాధ్యాయులు బోధనలు అందించాలన్నారు. గ్రామాల్లో మహిళా సంఘాల సభ్యులు కూడా వాళ్ళ పిల్లల్ని ప్రభుత్వ బడిలో చేర్పించాలన్నారు.
ప్రభుత్వం విద్యా , వైద్యం పైనే దృష్టి సారించింది అ దిశ గా అ రంగాలపై ప్రత్యేక దృష్టి పెట్టిందన్నారు. గతంలో మాదిరిగా కాకుండా ఇప్పుడు ప్రభుత్వ బడిలో కూడా ఇంగ్లీష్ మీడియం ఉందని, ప్రైవేటు పాఠశాలల కంటే ప్రభుత్వ పాఠశాలలో మెరుగైన విద్యాబోధనను విద్యార్థులకు ఉపాధ్యాయులు అందిస్తున్నారన్నారు. ప్రభుత్వ పాఠశాలలో బోధించే ఉపాధ్యాయులు అనుభవం కలిగి ఉన్నారన్నారు. విద్యార్థినీ, విద్యార్థులకు ప్రతిరోజు నాణ్యత తో కూడిన రుచి కరమైన భోజనం కూడా పెట్టడం జరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా విద్యాధికారి సత్యనారాయణ ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు.
ప్రయివేట్ పాఠశాలలకు ధీటుగా ప్రభుత్వ పాఠశాలలు మెరుగైన విద్యాబోధన
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES