Sunday, March 15, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేయాలి

ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేయాలి

- Advertisement -

విద్యతోనే గ్రామాభివృద్ధి సాధ్యం
సర్పంచ్ జూకంటి అనిల్ కుమార్
నవతెలంగాణ – ఆలేరు రూరల్

మన ఊరి ప్రభుత్వ పాఠశాలలను కాపాడుకోవడం ప్రతి ఒక్కరి బాధ్యత అని, విద్యతోనే అభివృద్ధి సాధ్యమవుతుందని టంగుటూరు గ్రామ సర్పంచ్ జూకంటి అనిల్ కుమార్ అన్నారు. ఆదివారం టంగుటూరులోని ఎలగందుల రాజ్యలక్ష్మి మెమోరియల్ ఉన్నత పాఠశాలలో నిర్వహించిన ప్రొఫెసర్ జయశంకర్ బడిబాట కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. కార్యక్రమానికి పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు కోడం రమాదేవి అధ్యక్షత వహించారు.ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రభుత్వం విద్యార్థులకు అందిస్తున్న అనేక సౌకర్యాలు, సదుపాయాల గురించి వివరించారు.ఉపాధ్యాయులు అంకితభావంతో పనిచేస్తూ తల్లిదండ్రుల నమ్మకాన్ని నిలబెడతారని తెలిపారు.ప్రైవేటు పాఠశాలలకు పంపిస్తున్న విద్యార్థులను ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పించాలని తల్లిదండ్రులకు కోరారు.

ముఖ్య అతిథిగా పాల్గొన్న సర్పంచ్ జూకంటి అనిల్ కుమార్ మాట్లాడుతూ గ్రామంలోని పిల్లలందరినీ ప్రభుత్వ పాఠశాలల్లో చదివించాలని పిలుపునిచ్చారు. ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేయడానికి తాను కూడా బాధ్యత వహిస్తానని చెప్పారు. పాఠశాల శ్రేయోభిలాషి, దాత ఎన్ఆర్ఐ కట్ట రాజిరెడ్డి మాట్లాడుతూ రెండు సంవత్సరాల క్రితం అనుకున్న కార్యక్రమం నేడు సఫలీకృతమవడం ఆనందంగా ఉందన్నారు.

సమావేశ ఖర్చులు, భోజన ఖర్చులు భరించిన కట్ట రాజిరెడ్డిని గ్రామస్తులు అభినందించారు. కార్యక్రమంలో పాఠశాల భవన దాత ఎలగందుల లక్ష్మీనారాయణ, మాజీ సర్పంచ్ ఎలగందుల వెంకటేశ్వర్లు, మహేందర్ రామన్న, జూకంటి బాబు, సీనియర్ ఉపాధ్యాయులు రమేష్, ఉపాధ్యాయులు రవికుమార్, శ్రీనివాస్, మహమ్మద్ ఖాజా అలీ, కోరుకొప్పుల వెంకటేష్, గ్రామస్తులు, యువకులు, మహిళలు, వివిధ సంఘాల ప్రతినిధులు, పత్రికా విలేకరులు పాల్గొన్నారు. అనంతరం విద్యార్థులు నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -