Friday, October 31, 2025
E-PAPER
Homeజిల్లాలుతడిసిన వరి ధాన్యాన్ని ప్రభుత్వం కొనుగోలు చేయాలి: సీపీఐ(ఎం)

తడిసిన వరి ధాన్యాన్ని ప్రభుత్వం కొనుగోలు చేయాలి: సీపీఐ(ఎం)

- Advertisement -

నవతెలంగాణ- కంఠేశ్వర్ 
తుఫాను ప్రభావంతో తడిసిన వరి ధాన్యాన్ని ప్రభుత్వం కొనుగోలు చేయాలి అని సీపీఐ(ఎం) నాయకుల డిమాండ్ చేశారు. ఈ మేరకు శుక్రవారం ఇటీవల ఏర్పడ మెంత తుఫాన్ ప్రభావంతో జిల్లాలో కురిసిన వర్షాల వలన కల్లాల మీద ఆరబెట్టిన వరి ధాన్యం వర్షాలతో తడిసి పోయిందని, దీనివలన వరి ధాన్యం కొనుగోలు చేయకపోతే ముక్కిపోయి, మొలకలెత్తి రైతులు తీవ్రంగా నష్టపోతారని అందువల్ల వెంటనే యుద్ధ ప్రాతిపదికన ప్రభుత్వం కొనుగోలు చేయాలని సీపీఐ(ఎం) జిల్లా కమిటీ ఆధ్వర్యంలో జిల్లా అదనపు కలెక్టర్ కి వినతి పత్రం అందజేశారు.

ఈ సందర్భంగా సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి బాబు మాట్లాడుతూ.. మెంతా తుఫాను ప్రభావంతో రైతులు కోసిన వరి ధాన్యం కల్లాలపైన ఎండబెట్టిన సందర్భంలో ప్రభుత్వం టర్పాలిన్లను సకాలంలో అందజేయకపోవటంతో చేతికొచ్చిన పంట వర్షార్పణం జరిగిందని, దానివల్ల రైతులు తీవ్ర మనోవేదనకు గురవుతున్నారని ప్రభుత్వం మరింత ఆలస్యం చేస్తే కొనుగోలు జరగకపోతే, వరి ధాన్యం ముక్కిపోయి మొలకెత్తి పనికిరాకుండా పోతుందని ఆయన అన్నారు.

ఈదురు గాలుల మూలంగా వరి, మొక్కజొన్న తదితర పంటలు నేలకొరిగి ధాన్యం రాలిపోయిందని, ఫలితంగా 40 సంచులకు పైగా వచ్చే దిగుబడి 15 – 20 సంచులు కూడా వచ్చే పరిస్థితి లేకుండా పోయిందని పోయిన రైతులకు నష్టపరిహారం చెల్లించాలని ఆయన డిమాండ్ చేశారు. వరదల వలన నష్టపోయిన రైతులు ఇంతవరకు నష్టపరిహారం అందక తీవ్రమైన ఆర్థిక ఇబ్బందులతో మనోవేదనకు గురవుతున్నారని వారిని వెంటనే ఆదుకోవాలని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు పెద్ది వెంకట్ రాములు, నూర్జహాన్, జిల్లా కమిటీ సభ్యులు సుజాత, నాయకులు ఉద్భవ్, రాజు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -