Sunday, September 28, 2025
E-PAPER
Homeప్రధాన వార్తలుగిరిజన తీజ్‌ను ప్రభుత్వం ప్రోత్సహించాలి

గిరిజన తీజ్‌ను ప్రభుత్వం ప్రోత్సహించాలి

- Advertisement -

ఉత్సవాల్లో పాల్గొన్న సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి జాన్‌వెస్లీ

నవతెలంగాణ-మంచాల
సంప్రదాయ పండుగలను కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉందని, రాష్ట్ర ప్రభుత్వం కూడా పండుగలను ప్రోత్సహించి, గిరిజనుల అభ్యున్నతికి కృషి చేయాలని సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి జాన్‌వెస్లీ అన్నారు. రంగారెడ్డి జిల్లా మంచాల మండలం చెన్నారెడ్డిగూడ గ్రామంలో గురువారం నిర్వహించిన గిరిజన సంప్రదాయ పండుగ తీజ్‌ ఉత్సవాలకు సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి జాన్‌వెస్లీ హాజరయ్యారు. గ్రామస్తులు, పార్టీ నాయకులు స్వాగతం పలికారు. సీపీఐ(ఎం) నాయకులు గిరిజన సంప్రదాయ దుస్తులు ధరించి, తీజ్‌ బుట్టలు ఎత్తుకున్నారు. అనంతరం జాన్‌వెస్లీ మాట్లాడుతూ.. పండుగలు ఐక్యతను చాటుతాయని, ఈ ఉత్సవాల్లో పాల్గొనడం సంతోషంగా ఉందన్నారు. తీజ్‌ ఉత్సవాలు ఘనంగా జరుపుకోవాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో పార్టీ రాష్ట్ర సీనియర్‌ నాయకులు డీజీ నర్సింహారావు, జిల్లా కార్యదర్శి పగడాల యాదయ్య, డీవైఎఫఐ్‌ రాష్ట్ర అధ్యక్ష, కార్యదర్శులు గండికోట రమేశ్‌, అనగంటి వెంకటేశ్‌, పార్టీ మండల కార్యదర్శి రావుల జంగయ్య, కార్యదర్శి వర్గ సభ్యులు ఆర్‌.స్వామి, రైతు సంఘం మండల నాయకులు పగడాల వెంకటేశ్‌, మండల కమిటీ సభ్యులు పగడాల విజయ, పార్టీ గ్రామ కార్యదర్శి బెల్లి పాండు, శాఖ కార్యదర్శులు తదితరులు ఉన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -