Sunday, July 20, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్ఇండ్లు లేని వారిని గుర్తించి ప్రభుత్వం ఆదుకోవాలి: సీపీఐ(ఎం)

ఇండ్లు లేని వారిని గుర్తించి ప్రభుత్వం ఆదుకోవాలి: సీపీఐ(ఎం)

- Advertisement -

నవతెలంగాణ – ఆర్మూర్
మున్సిపల్ పరిధిలోని ప్రభుత్వ భూములను రియల్ ఎస్టేట్ వ్యాపారులు కబ్జాలు చేసేందుకు యత్నిస్తున్నారని సీపీఐ(ఎం) డివిజన్ కార్యదర్శి వెంకటేష్ అన్నారు. పట్టణంలోని సీపీఐ(ఎం) కార్యాలయంలో శనివారం సాయంత్రం నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ..  నేడు ప్రభుత్వం అనేక హామీలను ఇచ్చిందని, వాటిలో ఏ ఒక్కటి అమలు చేయలేదని అన్నారు. మహిళలకు పెన్షన్లు లేవని, వృద్ధులకు కొత్త పెన్షన్లు రాలేవని, రూ.2500 ఏ ఒక్క మహిళ ఖాతాలోకి రాలేవని అన్నారు. ఇందిరమ్మ ఇల్లు కట్టుకునేందుకు అదనంగా కేంద్ర ప్రభుత్వం రూ.10 లక్షలు ఇవ్వాలని అన్నారు. రానున్న  ఎన్నికలలో పట్టణంతో పాటు పలు గ్రామాలలో ఎన్నికలలో పోటీ చేసేందుకు సమస్యల పరిష్కారానికై క్షేత్రస్థాయిలో తిరిగి తెలుసుకుంటున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో నాయకులు కూతాడి ఎల్లయ్య, భూమన్న గంగాధర్, తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -