Sunday, August 31, 2025
E-PAPER
spot_img
Homeతెలంగాణ రౌండప్వరదలు కారణంగా నష్టపోయిన రైతులను ప్రభుత్వం వెంటనే ఆదుకోవాలి: మాజీ ఎమ్మెల్యే 

వరదలు కారణంగా నష్టపోయిన రైతులను ప్రభుత్వం వెంటనే ఆదుకోవాలి: మాజీ ఎమ్మెల్యే 

- Advertisement -

నవతెలంగాణ – గాంధారిగాంధారి మండల కేంద్రంతోపాటు మండలంలోని బోప్పోజివాడి గ్రామాన్ని మరియు మండలంలోని వివిధ ప్రాంతాలను మాజీ ఎమ్మెల్యే జజాల సురేందర్ ఆదివారం
సందర్శించారు ఈ సందర్భంగా మండల కేంద్రంలోని గంగమ్మ గుడి భారీ వరదలకు కొట్టుకపోవడంతో అమ్మవారు ఉన్న స్థలంలో ఉన్న అమ్మవారి విగ్రహాలకు ఆయన ప్రత్యేక పూజలు నిర్వహించారు అనంతరం బొప్పాజీ వాడి చెరువు కట్ట తెగిపోయిన ప్రాంతాన్ని పరిశీలించారు వివిధ గ్రామాలు వరద నీటితో ముంపుకు గురయ్యాయినా ప్రాంతాలను స్థానిక నాయకులతో కలిసి ఆయన మండలంలో పరిశీలించారు వరద ప్రాంతాలను సందర్శించి వరద బాధితులను పరామర్శించారు.

ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే జాజాల సురేందర్ మాట్లాడుతూ  వరద బాధితులకు జరిగిన నష్టాన్ని ప్రభుత్వం పూర్తిగా బాధ్యత వహించి నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు, మరియు పంట నష్టం జరిగిన రైతులకు బిఆర్ఎస్ పార్టీ ఎల్లప్పుడు అండగా ఉంటుందని భరోసా కల్పించారు, నష్టపోయిన రైతులకు ప్రభుత్వం వెంటనే నష్టపరిహారం చెల్లించాలని కోరారు. జరిగిన నష్టపరిహారాన్ని రాష్ట్ర ప్రభుత్వం అధికారులతో పంట నష్టం అంచనా వేయించి పూర్తిగా బాధ్యత వహించి వరద బాధితులకు, రైతులకు నష్టపరిహారాన్ని చెల్లించాలన్నారు.

ప్రజల కోసం, ప్రజల శ్రేయస్సు కోసం తమ పార్టీ ప్రజలకు ఎల్లప్పుడు అందుబాటులో ఉంటుందని ఆయన అన్నారు బొప్పాజీవాడి గ్రామ చెరువు తెగి అలుగు వద్ద తీవ్ర నష్టం వాటిల్లింది. ఇప్పటి వరకు ఈ ప్రభుత్వ ప్రజాప్రతినిధులు, అధికారులు ఎవ్వరూ ఇటువైపు రాలేదని ప్రభుత్వం తక్షణమే స్పందించి చెరువుగట్టుకు మరమ్మతులు చేయాలని ఆయన అన్నారు  మాజీ ఎమ్మెల్యే వెంటా గాంధారి మండల నాయకులు స్థానిక నాయకులు తదితరులు ఉన్నారు.

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img
Ad
Ad